Home /News /sports /

TEAM INDIA FORMER CRICKETER WASIM JAFFER GIVES PERFECT REPLY TO MICHAEL VAUGHAN SATIRE SRD

Michael Vaughan Troll : మరోసారి నోటికి పని చెప్పిన మైకేల్ వాన్.. తిక్కకుదిర్చిన టీమిండియా మాజీ ఓపెనర్..

Michael Vaughan

Michael Vaughan

Michael Vaughan Troll : గతంతో పోలీస్తే సౌతాఫ్రికా టీమ్ (South Africa) చాలా బలహీనంగా ఉంది. దీంతో.. ఈ సారి టీమిండియా పని సులువు అవుతోందని అందరు భావించారు. కానీ.. చెత్త బ్యాటింగ్, పేలవ ఫీల్డింగ్‌తో విజయాన్ని చేజార్చుకుంది. దీంతో, విదేశీ క్రికెటర్లు తమ నోళ్లకు పనిచెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  సౌతాఫ్రికా గడ్డ (Ind Vs Sa)పై టెస్టు సిరీస్‌ నెగాలన్న టీమిండియా (Team India) ఆశ ఆడియాసలైంది. 30 ఏళ్లుగా గెలవని సిరీస్ ఈ సారైనా నెగ్గి.. చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో స్వీయ తప్పిదాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది.గతంతో పోలీస్తే సౌతాఫ్రికా టీమ్ (South Africa) చాలా బలహీనంగా ఉంది. దీంతో.. ఈ సారి టీమిండియా పని సులువు అవుతోందని అందరు భావించారు. కానీ.. చెత్త బ్యాటింగ్, పేలవ ఫీల్డింగ్‌తో విజయాన్ని చేజార్చుకుంది. పదే పదే ఆఫ్ సైడ్ బంతుల్ని వెంటాడీ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. బౌలర్లు మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఇక, ఫీల్డింగ్ లోనూ నిరాశపర్చింది కోహ్లీసేన. ముఖ్యంగా మనకు ప్రధాన బలంగా భావించే బ్యాటింగ్‌లో వైఫల్యం టీమిండియా కొంపముంచింది. దీంతో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అవకాశం దొరికితే చాలు టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ (Michael Vaughan) మళ్లీ తన నోటి దురదను తీర్చుకున్నాడు.

  సౌతాఫ్రికా చేతిలో టీమిండియాకు ఎదురైన ఓటమిని ఎగతాళి చేశాడజు. పోయి పోయి టీమిండియా మాజీ ఓపెనర్, సోషల్ మీడియా స్పెషలిస్ట్ వసీం జాఫర్‌ (Wasim Jaffer)ను గెలికాడు. ఇంకేముందు జాఫర్ గట్టిగానే తిక్క కుదిర్చాడు. టీమిండియా ఓటమిని ఉద్దేశిస్తూ మైకేల్ వాన్.. " గుడ్ ఈవ్‌నింగ్ వసీం జాఫర్‌. నువ్వు బాగున్నావా? లేదా? చెక్ చేస్తున్నా" అంటూ ఎటకారంగా ట్వీట్ చేశాడు. దీనికి వసీం జాఫర్ ఎప్పటిలానే మళ్లీ నోరెత్తకుండా అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిపడేశాడు.

  " మంచిగానే ఉన్న మైకేల్‌.. మర్చిపోకు... మీపై మేమే 2-1తో లీడ్‌లో ఉన్నాం. " అంటూ ఇంగ్లండ్ పర్యటన ఫలితాన్ని ఉద్దేశిస్తూ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. కాగా గతేడాది సెప్టెంబరులో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌ రెండింట నెగ్గి 2-1 తేడాతో ముందంజలో ఉంది. భారత శిబిరంలో కరోనా కలకలంతో ఆఖరి టెస్టు రద్దుకాగా... ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.


  అయితే మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య జరుగుతున్నఈ ట్వీటర్ వార్ ఇప్పటిది కాదు. చాలా రోజులుగా జరుగూతనే ఉంది. భారత్‌ను కించపరుస్తూ వాన్ వ్యాఖ్యానించిన ప్రతీసారి జాఫర్ తనదైన శైలిలో బదులిస్తూనే ఉంటాడు. ఇక తాజా రిప్లేపై భారత్ అభిమానులు సూపర్ అంటూ స్పందిస్తున్నారు. గెలికి మరి తన్నించుకోవడం అంటే ఇదేనని వాన్‌కు చురకలంటిస్తున్నారు. పోయి పోయి జాఫర్‌తో పెట్టుకున్నాడని, అతను అస్సలు వదలడని, ఇది ఇలానే కొనసాగుతుందని కామెంట్ చేస్తున్నారు.


  యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ మైకేల్ వాన్‌కు వసీం జాఫర్ చురకలంటించాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. నాలుగో వన్డేలో 92 పరుగులకే ఆలౌటైంది. దాంతో వాన్ ట్విటర్ వేదికగా టీమిండియా వైఫల్యాన్ని ఎగతాళి చేశాడు. " 92 పరుగులకే భారత్ ఆలౌట్.. ఈ రోజుల్లో కూడా 100 పరుగుల్లోపు ఓ జట్టు ఆలౌటవ్వడం నమ్మలేకపోతున్నా " అని ట్విటర్ వేదికగా బడాయికి పోయాడు.

  అయితే యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌లోనూ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అరంగేట్ర బౌల‌ర్ స్కాట్ బోలాండ్(6/7) ధాటికి 68 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీనిపై ఓ వీడియోను ట్వీట్ చేసిన జాఫర్.. అందులో తన మొబైల్‌లో మైకేల్ వాన్ చేసిన " 100 పరుగుల్లోపు ఆలౌటవుతారా? " అని ట్వీట్‌ను చూపించాడు. ఈ వీడియోకు ఇంగ్లండ్ 68 ఆలౌట్ అనే క్యాప్షన్‌తో మైకేల్ వాన్‌కు ట్యాగ్ చేశాడు..ఈ వీడియో ట్వీట్ చూసిన వాన్.. తన తలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక.. " వెరీ గుడ్ వసీం " అంటూ కవర్ చేసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే ట్వీట్ వార్ తో టీమిండియా ఫ్యాన్స్ కు బోలెడంత కిక్ వస్తోంది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, England, India vs South Africa, Team India

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు