TEAM INDIA FORMER CRICKETER VVS LAXMAN COMMENTS ON MS DHONI BS
MS Dhoni | ధోనిపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..
ఎంఎస్ ధోనీ
MS Dhoni : టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధోని సామర్థ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మహీ కనీసం మరో రెండు, మూడేళ్లు ఐపీఎల్ ఆడతాడని లక్ష్మణ్ అన్నాడు.
MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు ఈ పేరు వినగానే రిటైర్మెంట్ ఎప్పుడు? అని అడుగుతున్నారు. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని.. ఐపీఎల్ ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని చూశాడు. కానీ, కరోనా ప్రభావంతో ఆ అవకాశం దక్కేలా లేదు. ఏకంగా ఐపీఎల్ సీజన్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. దీంతో.. ఎవరికి తోచినట్లు వాళ్లు ధోని భవితవ్యంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ధోని ఇక రిటైర్మెంట్ చెబితే బెటర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, వీరందరికీ భిన్నంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధోని సామర్థ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మహీ కనీసం మరో రెండు, మూడేళ్లు ఐపీఎల్ ఆడతాడని లక్ష్మణ్ అన్నాడు.
‘ధోనిలో మరికొంత కాలం ఐపీఎల్ ఆడే సత్తా ఉంది. ఫిజికల్‌గానే కాక మెంటల్‌గానూ చాలా స్ట్రాంగ్. అతడి ఫిట్నెస్ సుప్రీం లెవల్లో ఉంది. వయసు అనేది అతడికి ఒక నంబర్ మాత్రమే. నాయకుడిగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ముందుండి నడిపించడం ధోనీకి చాలా ఇష్టం. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ కష్టం కావడంతో మళ్లీ ఆడతాడో లేదోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఐపీఎల్ కాదు.. రాబోయే రెండు, మూడు ఐపీఎల్ సీజన్లలో మహీ కచ్చితంగా ఆడుతాడు. ఇదే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను’ అని అన్నాడు. టీమిండియా తరఫున ఆడే విషయంపై మాట్లాడుతూ.. కొత్త సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉందని లక్ష్మణ్ చెప్పాడు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.