Home /News /sports /

TEAM INDIA FORMER CRICKETER SURESH RAINA DANCES TO SRIVALLI SONG IN ALL ARJUN STARRER PUSHPA WATCH VIRAL VIDEO SRD

Viral Video : నీ యవ్వ తగ్గేదే లే.. శ్రీవల్లి పాటకు స్టెప్పులు ఇరగదీసిన సురేష్ రైనా..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా మామూలుగా లేదు. అప్పుడే దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. ఈ సినిమాకు క్రికెట‌ర్లు మరింత ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు.

    టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా మేనియా నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు క్రికెట‌ర్లు మరింత ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. ఇప్ప‌టికే మ‌న దేశ క్రికెట‌ర్లు మాత్ర‌మే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) కూడా పుష్ప సినిమాలోని పాట‌ల‌కు స్టెప్పులు వేస్తూ అల‌రించాడు. తాజాగా ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ సీనియ‌ర్ బ్యాట‌ర్ సురేష్ రైనా (Suresh Raina) కూడా చేరాడు. ఇటీవ‌ల పుష్ప సినిమా చూసిన రైనా.. అందులోని శ్రీ‌వ‌ల్లి పాట‌కు పుష్ప రాజ్‌గా స్టెప్పులేసి అద‌ర‌గొట్టాడు. అచ్చం అల్లు అర్జున్ మాదిరిగానే స్టెప్పులేశాడు. అల్లు అర్జున్ మాదిరిగానే పాద ర‌క్ష‌ల‌ను, క‌ళ్ల‌జోడు ధ‌రించి ఆక‌ట్టుకున్నాడు. ఈ వీడియాలో రైనాతోపాటు మ‌రో ఇద్ద‌రు కూడా స్టెప్పులేయ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

    ఈ వీడియోను సురేష్ రైనా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్‌పై రైనా ప్ర‌శంస‌లు కురిపించాడు. పుష్ప సినిమాను చూశాన‌ని, అల్లు అర్జున్ న‌ట‌న బాగుంద‌ని కొనియాడాడు. అల్లు అర్జున్ మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకున్నాడు. అలాగే నీ శ్రీ‌వ‌ల్లి పాట‌ను ఏదో అలా ప్ర‌య‌త్నించాన‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

    ప్ర‌స్తుతం సురేష్ రైనా చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అభిమానులు లైక్‌లు, కామెంట్లు, షేర్ల‌తో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాగా ఇదే పాట‌కు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ కూడా స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నాడు.








    View this post on Instagram






    A post shared by Suresh Raina (@sureshraina3)





    అంతేకాకుండా టీమిండియా యువ క్రికెట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్ కిష‌న్ కూడా ఈ పాట‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. అలాగే పుష్ప డైలాగ్‌ను డేవిడ్ వార్న‌ర్, ర‌వీంద్ర జ‌డేజా చెప్పి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. మరోవైపు విదేశాల్లో పలువురు చిన్నారులు కూడా పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

    ఇది కూడా చదవండి : మెగావేలానికి పది ఫ్రాంచైజీలు రెడీ.. ఎవరి వద్ద ఎంత డబ్బు ఉందంటే..

    ఇక, ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనా పాల్గొన‌నున్నాడు. ఐపీఎల్‌లో సురేష్ రైనా ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడాడు. కానీ ఈ సారి చెన్నై రిటెన్ష‌న్ జాబితాలో రైనాకు చోటు ద‌క్క‌లేదు. అయితే వేలంలో రైనాను మ‌ళ్లీ చెన్నై సూప‌ర్ కింగ్సే ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 32 స‌గ‌టుతో 5528 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, 39 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Allu Arjun, Pushpa, Suresh raina, Team India, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు