Rohit Sharma Weakness : రోహిత్ శర్మ ఇలా పదే పదే అదే తప్పును చేస్తూ ఔటవడంపై క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులు మండిపడుతున్నారు. హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు.
భారత్, శ్రీలంక (IND vs SL) మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో తన వీక్ నెస్ పాయింట్ తో శ్రీలంక పన్నిన వలలో చిక్కుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక అనవసరమైన దూకుడుతో ఫుల్ షాట్‌కు ప్రయత్నించి మరోసారి బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. రోహిత్ శర్మ ఇలా దూకుడుతో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్‌గా ఆడి ఔటవ్వడం ఇది కొత్తేం కాదు. గతంలోనే అనేక మ్యాచ్‌ల్లో క్రీజులో చక్కగా కుదురుకున్నాక దూకుడుతో ఫుట్ షాట్ ఆడి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో హిట్‌మ్యాన్ ఎక్కువగా ఇదే తరహా బంతులకు ఔటయ్యాడు. రోహిత్ బలహీనతను అర్థం చేసుకున్న ప్రత్యర్థి కెప్టెన్లు కూడా బౌలర్లతో షార్ట్ పిచ్ బంతులు వేయిస్తూ బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లను పెట్టి రోహిత్‌ను ఔట్ చేస్తున్నాడు.
రోహిత్ శర్మ ఇలా పదే పదే అదే తప్పును చేస్తూ ఔటవడంపై క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులు మండిపడుతున్నారు. హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. మరి కొందరైతే ఏంది రోహిత్ అన్న ఇది పదే పదే అదే తరహా షాట్‌కు ఔట్ అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ సమయోచితంగా ఆడుతూ రాణించాలని, దూకుడును తగ్గించుకోవాలని చెబుతున్నారు. అయితే గతంలోనే హిట్‌మ్యాన్ ఈ విమర్శలను తిప్పికొట్టాడు. తాను భారీ స్కోర్ చేసినప్పుడు ఇదే తరహా షాట్లతో ఆ పరుగులు రాబట్టానని గుర్తు చేశాడు.
ఇక, లేటెస్ట్ గా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ విషయంలో రోహిత్ కు విలువైన సలహా ఇచ్చాడు. క్రీజులో సెటిల్ అయ్యేవరకు రోహిత్ తన ఫేవరేట్ పుల్ షాట్ ఆడవద్దని సూచించాడు. పుల్ షాట్ ఆడే విషయంలో రోహిత్ శర్మ అప్రమత్తంగా ఉండాలని గవాస్కర్ సూచించాడు. బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లోనైనా క్రీజులో సెట్ అయ్యేంతవరకు ఈ షాట్ ఆడవద్దని స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గవాస్కర్ హిట్‌మ్యాన్‌కు సలహా ఇచ్చాడు.
" పుల్ షాట్ ఆడటంపై రోహిత్ శర్మ సీరియస్‌గా ఆలోచించాలి. ఇది అతని ఫేవరేట్ షాటని, ఎన్నో పరుగులు చేశాడని నాతో మీరంతా వాదించవచ్చు. కానీ ఆ షాట్ ఆడబోయే రోహిత్ చాలా సార్లు ఔటయ్యాడనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ షాట్ కారణంగా ప్రతీ బౌలర్ ముందు హిట్‌మ్యాన్ తక్కువ అయిపోయాడు. ప్రతీ ఒక్కరు షార్ట్ పిచ్ బాల్స్ వేస్తూ అతన్ని ఔట్ చేస్తున్నారు.
ఈ షాట్‌తో అతను కొట్టే బౌండరీలు, సిక్స్‌లు కంటే.. బంతి గాల్లోకి లేచి ఔటయ్యే చాన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకసారి ఈ షాట్‌తో అతను చేసిన పరుగులు, ఔటైన సందర్భాలను చూసుకోవాలి. పర్సంటేజ్ గమనించాలి. అప్పుడు అతనికే అర్థమవుతుంది. క్రీజులో సెట్ అయి.. 80,90, 100 పరుగులు చేసేవరకు రోహిత్ పుల్ షాట్ జోలికి వెళ్లకపోవడమే అతనికి మంచిది " అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.