ఏప్రిల్ 2 ఉదయం భారత క్రికెట్‌కు విషాదకరమైన వార్త అందించింది. టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ ..స్పిన్ ఆల్‌రౌండర్ సలీమ్ దురానీ (Salim Durrani) కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సున్న ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో (Cancer) బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం గుజరాత్‌లోని (Gujarath) జామ్‌నగర్‌లో (Jamnagar) తుదిశ్వాస విడిచారు. దురానీ భారత్ తరఫున టెస్టు క్రికెట్ మాత్రమే ఆడాడు. అభిమానుల డిమాండ్ మేరకు సిక్సర్లు కొట్టేవారని దురానీకి మంచి పేరు ఉంది. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్, టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సలీం దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ నగరంలో జన్మించారు. ఆయన 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1973లో ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడారు. 13 ఏళ్ల కెరీర్‌లో దురానీ భారత్ తరఫున మొత్తం 27 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో ఆయన 1202 పరుగులు చేసి 78 వికెట్లు తీశాడు. అతను టెస్టుల్లో 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 10 వికెట్లు తీసిన ఘనత సాధించారు. 3 సార్లు 5 వికెట్లు తీశారు.
Easily one of the most colourful cricketers of India - Salim Durani. Rest in Peace. ॐ शांति ???? pic.twitter.com/d5RUST5G9n
— Ravi Shastri (@RaviShastriOfc) April 2, 2023
ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్
సలీం దురానీ తన దేశీయ క్రికెట్ కెరీర్‌ను 1953లో ప్రారంభించాడు. మొదట సౌరాష్ట్ర జట్టుకు ఆడారు. ఆ తర్వాత 1954 నుంచి 1956 వరకు గుజరాత్ తరఫున.. 1956 నుంచి 1978 వరకు రాజస్థాన్ తరఫున ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో గుర్తింపు పొందారు.
ఇతర విజయాలు
అర్జున అవార్డు పొందిన తొలి క్రికెటర్ సలీం దురానీ. ఇది కాకుండా ఆయనకు 2011 సంవత్సరంలో BCCI ద్వారా CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. క్రికెట్‌తో పాటు సినిమాల్లో కూడా పనిచేశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దురానీ.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1973లో నటుడు ప్రవీన్ బాబీతో కలిసి ‘చరిత్ర’ సినిమాలో పనిచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India, Ravi Shastri, Team India