Home /News /sports /

TEAM INDIA FORMER CRICKETER RAVI SHASTRI MADE SOME COMMENTS ON BCCI AND VIRAT KOHLI SRD

Ravi Shastri : " గంగూలీ, ద్రవిడ్ వల్లే కాలేదు.. కోహ్లీని టార్గెట్ చేస్తారా..? ".. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు..

Ravi Shastri

Ravi Shastri

Ravi Shastri : కోహ్లీ కెప్టెన్సీ వివాదం తర్వాత మాజీ క్రికెటర్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు తలా ఓ మాట అనేస్తున్నారు. విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాటలు అంటున్నారు. అయితే, లేటెస్ట్ గా కోహ్లీకి మద్దతుగా నిలిచాడు రవిశాస్త్రి.

    టీమిండియా (Team India).. సౌతాఫ్రికా పర్యటన (India Tour Of South Africa) ముగిసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమైంది. అటు టెస్ట్ సిరీస్ ఇటు వన్డే సిరీస్ రెండింటినీ కోల్పోయింది. దక్షిణాఫ్రికా పర్యటన కంటే ముందే బీసీసీఐ..విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం కారణంగా దూరమవడంతో..కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్ ట్యాగ్ లేకుండా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన కోహ్లి..వరుసగా మూడు మ్యాచ్ లలో 79, 0, 65 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం తర్వాత మాజీ క్రికెటర్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు తలా ఓ మాట అనేస్తున్నారు. విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాటలు అంటున్నారు. ఇక, విరాట్ కోహ్లీకి లేటెస్ట్ గా మద్దతుగా నిలిచాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.

    కెప్టెన్సీ నుంచి వైదొలగడం అతని నిర్ణయమని..ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉందన్నాడు రవిశాస్త్రి (Ravishastri). కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా..కోహ్లీ ఆటతీరులో పెద్ద తేడా ఉండదని రవిశాస్త్రి చెప్పాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా పరాజయం పాలయినంత మాత్రాన ఐదేళ్లుగా నెంబర్ 1 గా ఉన్న టీమ్..ఒక్కసారిగా పడిపోయిందని చెప్పడం మంచిది కాదన్నాడు. ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

    ఇక, ఓ ఆటగాడి సామర్థ్యాన్ని అతని ఆటను బట్టి లెక్కించాలి గానీ, ప్రపంచకప్‌లతో కాదన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచకప్‌ల తర్వాత మెగా టోర్నీ టైటిల్ అందుకున్నాడని, భారత దిగ్గజ క్రికెటర్లుగా చెప్పుకునే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అసలు ప్రపంచకప్‌లే గెలవలేదన్నాడు. అంతమాత్రాన వాళ్లు చెత్త ఆటగాళ్లు అవుతారా? అని ప్రశ్నించాడు. టీమిండియా తరఫున ప్రపంచకప్ గెలిచిన సారథులు ఇద్దరే ఉన్నారని గుర్తు చేశాడు.

    ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో బ్లాక్ క్యాప్స్ చేతిలోనే ఓటమిపాలైంది.

    ఇది కూడా చదవండి : వావ్ షెఫాలీ వర్మ .. మళ్లీ టాప్ లేపిన లేడి సెహ్వాగ్..

    ఇక ఎన్నో అంచనాల మధ్య 2021 టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా.. కనీసం సెమీస్ చేరకుండా ఇంటిదారిపట్టింది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. మెగా టోర్నీకి ముందే టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోగా.. ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమితో సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతలను కూడా విరాట్ వదులుకున్నాడు.కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పిన రవిశాస్త్రి.. రోహిత్ శర్మను తదుపరి కెప్టెన్‌గా ఎంపికచేయాలన్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Ravi Shastri, Sachin Tendulkar, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు