టీ-20 ప్రపంచకప్ (T-20 World Cup 2021)లో సూపర్ విక్టరీతో భారత్ (Team India) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్ అయిన బ్యాటింగ్ ఒక్కసారిగా "సూపర్ హిట్" అయ్యింది. విలన్లుగా మారిన టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా హీరోలుగా మారారు. గ్రూప్–2లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ (Afghanistan) భారత్ ఆల్‌రౌండ్ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. అయితే, భారత్ గ్రాండ్ విక్టరీని తట్టుకోలేక పాకిస్తాన్ (Pakistan) జనాలు కుళ్లుకుంటున్నారు. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఫిక్స్ అయిదంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు.. పరువు దక్కించుకునేందుకు అఫ్గాన్ క్రికెట్ టీమ్‌ను కొనేసి విజయాన్నందుకుందని పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫిక్సింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. కోహ్లీసేన దారుణ వైఫల్యంతో టీమిండియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, బీసీసీఐ తమ ఉనికి కోసం ఈ పనిచేసిందని కామెంట్ చేస్తున్నారు.
అయితే పాకిస్థాన్.. న్యూజిలాండ్ జట్లపై వరుసగా టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోయాడు. రాత్రి మ్యాచ్‌ల్లో మంచు ప్రభావం ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకొని విజయాలందుకుంటున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో భారత ఓటమికి టాస్ ఓడిపోవడం ముఖ్యం కారణమైంది. ఈ క్రమంలోనే బుధవారం మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ తన నిర్ణయం చెప్పేందుకు మ్యాచ్ ప్రజెంటర్ సమీపానికి వెళ్తుండగా.. అతనికి కంగ్రాట్స్ చెప్పిన విరాట్ కోహ్లీ.. " మీరు మొదట బౌలింగ్ చేయబోతున్నారా..? " కదా ప్రశ్నించాడు.
దానికి అవునన్నట్లుగానే నబీ " మేము మొదట బౌలింగ్ చేస్తాం " అని మ్యాచ్ ప్రజెంటర్‌తో చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తున్న పాక్ నెటిజన్లు.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అఫ్గానిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రలోభానికి గురి చేశాడని వాదిస్తున్నారు. అలానే ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ అఫ్గానిస్థాన్ పేలవ ప్రదర్శనకు తమ టీమ్‌మేనేజ్‌మెంట్ వచ్చిన ఆదేశాలనేనని, నబీసేన అమ్ముడుపోయిందని కామెంట్ చేస్తున్నారు. మాములు అభిమానులే కాకుండా సెలెబ్రేటీలు సైతం ఇవే ఆరోపణలు చేస్తున్నారు.
? https://t.co/ezg5o98KOh pic.twitter.com/KnxQkIDjQi
— Aakash Chopra (@cricketaakash) November 3, 2021
పాకిస్థాన్ టీవీ నటి సెహర్ షిన్వారి ఈ మ్యాచ్ ఫలితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మ్యాచ్‌ను బీసీసీఐ కొనుగోలు చేసిందని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మ్యాచ్ అనంతరం చేసిన ట్వీట్‌కు బదులుగా ఆమె రీ ట్వీట్ చేసింది. విక్టరీ తర్వాత టీమిండియాకు విషెష్ తెలుపుతూ "భారత్.. భారత్‌లా ఆడిందంటూ" ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
అయితే, ఆకాశ్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చిన పాక్ నటి.. "ఓ మంచి మ్యాచ్‌ను బీసీసీఐ కొనుగోలు చేసింది" అంటూ రీ ట్వీట్ చేసింది. సెహర్ షిన్వారి చేసిన వ్యాఖ్యలకు ఆకాష్ చోప్రా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. "వక్రబుద్ది గల మనుషుల నుంచి ఇలాంటి నెగిటివ్ మాటలే వస్తాయి" అంటూ కౌంటర్ ఇచ్చాడు.
వాస్తవానికి అఫ్గానిస్థాన్‌పై మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఉంటే..? తొలుత బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపేది. ఈ విషయాన్ని టాస్ సమయంలో విరాట్ కోహ్లీ కూడా వెల్లడించాడు. అలాంటప్పుడు నబీని ఫస్ట్ బౌలింగ్ చేయమని ప్రలోభానికి గురి చేయాల్సిన అవసరం కోహ్లీకి లేదు. విరాట్ కోహ్లీ చేసిన సరదా వ్యాఖ్యల్ని కూడా సాకుగా చూపి రాక్షసానందం పొందుతున్నారంటూ పాక్ ఫ్యాన్స్ .. టీమిండియా అభిమానులు కౌంటరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, Pakistan, T20 World Cup 2021, Team India