ఆటగాళ్లకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని పీసీబీ చీఫ్ రమీజా రాజా (Ramiz Raja).. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) రూల్స్ మార్చితే ఐపీఎల్ (IPL) క్రేజ్ పడిపోతుందని బీరాలు పలికిన సంగతి తెలిసిందే. పీఎస్‌ఎల్‌ను వేలం మోడ్‌లోకి మార్చి ఫ్రాంచైజీల పర్స్‌మనీ పెంచితే ఐపీఎల్‌ను మించిపోతుందని గొప్పలు చెప్పుకున్నాడు. విదేశీ ఆటగాళ్లంతా పాకిస్థాన్‌కు క్యూ కడతారని, ఐపీఎల్‌ను కాదని మరీ పీఎస్‌ఎల్ ఆడుతారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయ్. లేటెస్ట్ గా రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra). ఒక్క పీసీబీ మాత్రమే కాదని ప్రపంచంలోని ఇతర ఏ క్రికెట్ లీగ్ కూడా ఐపీఎల్‌కు పోటీ ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు.
వీక్షకుల సంఖ్య అధికంగా ఉండడం ఐపీఎల్‌కు ప్లస్ పాయింటని చెప్పుకోచ్చాడు. ఇక నగదు, మార్కెట్ విలువ ఐపీఎల్‌ను అసమానంగా మార్చిందని తెలిపాడు. ఒక వేళ డ్రాఫ్ట్ పద్దతి కాదని, వేలానికి వెళ్లిన రమీజ్ రాజా చెప్పింది జరగదని, పీఎస్ఎల్‌లో 16 కోట్ల రూపాయల ధర పలికే ఆటగాడిని మనం చూడలేమని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పాడు.
రమీజ్ రాజ్ చెప్పిన మార్కెట్ శక్తులే దీనిని ఆమోదించవని, పీఎస్‌ఎల్, బీబీఎల్, ది హండ్రెడ్, సీపీఎల్ ఏదీ కూడా ఐపీఎల్‌కు పోటీ ఇవ్వలేదు ఆకాశ్ చోప్రా తేల్చి చెప్పాడు. ప్రసారం హక్కుల ద్వారా మీకు ఎంత డబ్బు వస్తుందని ప్రశ్నించాడు. జట్లను ఎంత ధరకు అమ్ముతారని, మీరు ఆడే దాని ప్రకారం మీ మొత్తం పర్స్ ఉంటుందని ఆయన రమీజ్ రాజాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయని, అవి విడివిడిగా ఉండవని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ " ఆర్థికంగా మరింత బలమయ్యేందుకే మేం కొన్ని ఆస్తులను సృష్టించుకోవాలి. ప్రస్తుతం మా వద్ద పీఎస్‌ఎల్, ఐసీసీ నిధుల తప్ప ఏమీ లేవు. వచ్చే ఏడాది జరిగే పీఎస్‌ఎల్‌కు సంబంధించిన విధానంపై ఓ వాదన ఉంది. వచ్చే ఏడాది నుంచి పీఎస్‌ఎల్ వేలం మోడ్‌లోకి మార్చాలనేది నా అభిప్రాయం. ఈ విధానానికి మార్కెట్ అనుకూలంగా ఉంది.
ఫ్రాంచైజీ యాజమానులతో దీనిపై చర్చిస్తాను. క్రికెట్ డబ్బుల ఆట. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా బలపడితే మనపై గౌరవం రెట్టింపు అవుతుంది. పీసీబీకి ప్రధాన ఆర్థిక వనరు పీఎస్‌ఎల్. ఈ ధనాధన్ లీగ్‌ను వేలం ఫార్మాట్‌లోకి మార్చి, ఫ్రాంచైజీల పర్స్ మనీ పెంచితే ఐపీఎల్ డిమాండ్‌ను తగ్గించవచ్చు. అప్పుడు పీఎస్‌ఎల్‌ను కాదని ఏ విదేశీ ఆటగాడు ఐపీఎల్‌కు వెళ్లలేడు. వచ్చేడాది పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్ తరహాలోనే హోమ్, అండ్ అవే పద్దతిలో నిర్వహించాలనుకుంటున్నాం. అప్పుడు గేట్ మనీ చాలా వస్తుంది.
ప్రతీ జట్టు పర్స్ పెరుగుతుంది. అయితే ఇదంతా జరగాలంటే ఫ్రాంచైజీలు ముందు మరిన్ని డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెగా వేలం విధానంలో నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభ కలిగిన ఆటగాళ్లంతా అందుబాటులోకి వస్తారు. ఈ విషయంపై ఇప్పటికే నేను పలువురు ఫ్రాంచైజీ ఓనర్లతో మాట్లాడాను. వారంతా ఈ విధానం పట్ల సముఖంగా ఉన్నారు. మరికొందరితో మాట్లాడాల్సి ఉంది. ప్రస్తుతం సంపద్రింపుల దశలో ఉన్నప్పటికీ నా కోరికల లిస్ట్‌లో మాత్రం టాప్‌లో ఉంది" అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : క్రికెటర్లు కాకముందు వీరు చేసిన జాబ్స్ తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం
నిజంగా ఐపీఎల్‌లో అన్ క్యాప్‌డ్ ప్లేయర్లకు దక్కే జీతం కూడా పీఎస్‌ఎల్ టాప్ క్లాస్ ప్లేయర్‌కు అందదు. ఏ లెక్కన చూసుకున్న ఐపీఎల్‌కు పీఎస్‌ఎల్ పోటీనే కాదు. ఇక రమీజ్ రాజా వ్యాఖ్యలపై భారత అభిమానులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్ క్రేజ్ గురించి మాట్లాడటం తర్వాత కానీ... ఆటగాళ్లకు జీతాలు సరిగ్గా ఇవ్వండని చురకలంటిస్తున్నారు. అంతేకాకుండా పాక్ పర్యటనకు వచ్చిన ఆటగాళ్లకు సౌకర్యాలు మెరుగుపరచాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, IPL 2022, Pakistan, Team India