Home /News /sports /

TEAM INDIA FORMER CAPTAIN MS DHONI SENDS SURPRISE GIFT TO PAKISTAN CRICKETER HARIS RAUF SRD

MS Dhoni : పాకిస్థాన్ బౌలర్ కి అదిరిపోయే బహుమతి ఇచ్చిన ధోనీ.. ఆ ప్లేయర్ రియాక్షన్ ఏంటంటే..

MS Dhoni

MS Dhoni

MS Dhoni : టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది.

    కొంతమంది ఆటగాళ్లు తమ అభిమానులకు రోల్ మోడల్స్ అయితే మరికొందరు దేవుళ్లలా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). అతని రికార్డులు, మైదానంలో కూల్ స్టైల్ వల్ల ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket)కు వీడ్కోలు పలికి ఉండవచ్చు. కానీ, ధోనీ అభిమానగణం పెరుగుతూనే ఉంది. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ (Haris Rauf) ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా ధోనీని కలిసి ముచ్చటించాడు.

    అయితే తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ రౌఫ్ ధోనీ ఓ బహుమతిని పంపి ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తాను ధరించే జెర్సీని ధోనీ తమ జట్టు మేనేజర్ ద్వారా తచకు పంపించాడు. ధోనీ నెం.7 జెర్సీకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    అయితే, కెప్టెన్ కూల్ తనకు జెర్సీని కానుకగా పంపడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రౌఫ్ తెలిపాడు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నాడు. నం.7 జెర్సీ అనేది ధోనీ మంచితనం వల్ల ఇప్పటికీ ఆదరణ పొందుతోందని రౌఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ధోనీ తనకు పంపిన జెర్సీని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

    ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తోన్న పాక్‌ యంగ్‌ క్రికెటర్‌కు ఓ దిగ్గజ ఆటగాడు జెర్సీ పంపించాడంటే మామూలు విషయమేమీ కాదు. అందుకే తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.‘ క్రికెట్‌ దిగ్గజం.. కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్‌ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’ అంటూ ధోనిపై తన అభిమానం చాటుకున్నాడు రౌఫ్.


    అయితే, ఇందుకు స్పందించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌( CSK) మేనేజర్‌ రసెల్‌ రాధాకృష్ణన్‌.. ‘మా కెప్టెన్‌ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు’ అని తమ సారథిపై ప్రశంసలు కురిపించాడు.

    ఇది కూడా చదవండి : పాపం.. తప్పని పరిస్థితుల్లో ఈ స్పోర్ట్స్ వుమెన్ శృంగార తారలుగా మారారు..!

    ఇక, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ధోని 2021లో చెన్నైను ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇక యూఏఈలో నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ 2021 సందర్భంగా టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించాడు ధోని. ఆ టోర్నీలో భారత్‌తో పాకిస్తాన్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, India VS Pakistan, MS Dhoni, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు