హోమ్ /వార్తలు /sports /

MS Dhoni : కార్ గారేజ్ లో దోస్త్ లతో ధోనీ లంచ్..తెల్లటి గడ్డం, కోర మీసాలతో తలైవా లుక్ సూపరో సూపర్..

MS Dhoni : కార్ గారేజ్ లో దోస్త్ లతో ధోనీ లంచ్..తెల్లటి గడ్డం, కోర మీసాలతో తలైవా లుక్ సూపరో సూపర్..

MS Dhoni : ధోనీ స్టార్ క్రికెటర్​ అయినప్పటికీ.. తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. సమయం దొరికినప్పుడల్లా వారితో ఎంజాయ్ చేస్తాడు.

MS Dhoni : ధోనీ స్టార్ క్రికెటర్​ అయినప్పటికీ.. తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. సమయం దొరికినప్పుడల్లా వారితో ఎంజాయ్ చేస్తాడు.

MS Dhoni : ధోనీ స్టార్ క్రికెటర్​ అయినప్పటికీ.. తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. సమయం దొరికినప్పుడల్లా వారితో ఎంజాయ్ చేస్తాడు.

    మహేంద్ర సింగ్ ధోనీ..(Mahendra Singh Dhoni) ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా మహీ.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ధోనీ పేరు ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంది. ఇక, ఐపీఎల్ 2021 సీజన్ కు బ్రేక్ రావడంతో.. మహేంద్ర సింగ్ ధోనీ తనకు దొరికిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తున్నాడు.ఇక, ధోనీ విశేషాలను అప్పుడప్పుడు అతని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేయడం తప్ప.. అతని గురించి ఎలాంటి సమాచారం దొరకడం లేదు. లేటెస్ట్ గా హిమాచల్ ప్రదేశ్ టూర్‌ కంప్లీట్ చేసుకు స్వస్థలానికి వచ్చిన ఎంఎస్ ధోనీ.. తాజాగా రాంచీలో తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైమ్‌పాస్ చేశాడు. గారేజ్‌లో ఉండే బల్లపైనే భోజనం పెట్టుకుని మాట్లాడుకుంటూ తిన్నాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్​ రాయిస్​ కారు కూడా ఉంది. దానిని ఓ వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఆ ఫొటోలో కనిపిస్తున్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

    టీమిండియాకి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన గొప్ప కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహీ సింప్లిసిటీకి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ధోనీ స్టార్ క్రికెటర్​ అయినప్పటికీ.. తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. సమయం దొరికినప్పుడల్లా వారితో ఎంజాయ్ చేస్తాడు. అందుకే అతన్ని చాలా మంది మిత్రులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక టీమిండియాలో కూడా మహీకి మిత్రులు ఎక్కువే. ఇక, తెల్లటి గడ్డం, కోర మీసాలతో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ న్యూ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

    అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాది గడిచినా.. ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత దేశంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడు మహీనే. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీ నికర ఆదాయం 2021 మార్చి నాటికి 110 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 826 కోట్లు. ఇందులో సగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారానే వస్తుంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 15 కోట్లు వస్తుంది. ఒక్కో ప్రకటనకు మహీ 1-3 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం. ప్రస్తుతం మహీ ఖాతాలో అటుఇటుగా 15 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి.

    First published:

    ఉత్తమ కథలు