TEAM INDIA FORMER CAPTAIN GAUTAM GAMBHIR MADE SOME INTERESTING COMMENTS ON VIRAT KOHLI BATTING IN COMING DAYS SRD
Gautam Gambhir : " అతడు మరింత రెచ్చిపోతాడు.. ప్రత్యర్ధి జట్లకు చుక్కలే "
Virat Kohli
Gautam Gambhir : టీమిండియాలో (Team India) ఇప్పుడు అన్నీ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ముగిసిన తర్వాత టీమిండియాలో సమూల మార్పులకు బీసీసీఐ (BCCI) తెరతీసింది.
విరాట్ కోహ్లీని (Virat Kohli) వన్డే కెప్టెన్సీ తప్పించిన దగ్గర నుంచి క్రికెట్ ప్రపంచంలో మొదలైన రచ్చ రోజు రోజుకీ ముదురుతోంది. విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్ గా నియమించడంతో అసలు రచ్చ మొదలైంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), రోహిత్ శర్మను టార్గెట్ ను చేసుకుని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్, కోహ్లీని కోరడం... అందుకు కెప్టెన్ విరాట్ అంగీకరించలేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీస్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగిస్తూ బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చాడు గంగూలీ. ఆటగాడిగా ఆకట్టుకుంటూ.. ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బదులిస్తూ.. కెప్టెన్‌గా నిలకడైన విజయాలు సాధిస్తూ.. ఇన్నాళ్లూ జట్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన అతడు అనూహ్య పరిస్థితుల నడుమ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఒకరకంగా అతడికి ఇబ్బందికరమే. దీంతో, అతడి ఫ్యాన్స్ నెట్టింట వేదికగా రెచ్చిపోతున్నారు.
మరోవైపు, విరాట్ కోహ్లీ కొందరు మాజీ క్రికెటర్లు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించడం కరెక్ట్ అనే వాదన విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించినా అతని ఆటలో ఎలాంటి మార్పు ఉండదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
Gautam Gambhir
బీసీసీఐ నిర్ణయంతో విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. " సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మపై ఎలాంటి భారం లేదు. అదే తరహాలే ఇప్పుడు కోహ్లీపై వన్డే, టీ20 కెప్టెన్సీ భారం ఉండదు. ఈ నేపథ్యంలో విరాట్ మరింత నైపుణ్యంతో ఆడే అవకాశముంది. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కచ్చితంగా మెరుగైన బ్యాటింగ్ ఫామ్‌ను కనబరుస్తాడని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఇద్దరు మెరుగైన కెప్టెన్లు భారత జట్టుతో తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. కెప్టెన్సీ పోయినంత మాత్రాన విరాట్ కోహ్లీ ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు. కోహ్లీలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తాం " అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు, తనపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ట్రోలింగ్ నేఫథ్యంలో న్యూస్ 18 తో మాట్లాడిన సౌరవ్ గంగూలీ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ పదవి నుంచి ఎందుకు, ఎలా తప్పించాల్సి వచ్చిందో దాదా చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కూడా కోహ్లీతో మాట్లాడి చూశానని.. అలాగే వ్యక్తిగతంగా కూడా ఉన్న సమస్యలను కూడా చర్చించానని గంగూలీ చెప్పుకొచ్చాడు.
అయితే అంతిమంగా కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి నిరాకరించినట్లు చెప్పాడు. అయితే, ఇండియాకు కోహ్లీ చేసిన సేవలకు గంగూలీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా కోహ్లీ చాలా సాధించాడని గంగూలీ అన్నాడు. ఇకపై కూడా ఆటగాడిగా జట్టుతో కోహ్లీ ఉండటం లాభించే విషయం అని అన్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.