హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India : ఒకప్పుడు ప్రపంచకప్ లో టీమిండియాకు ఆడాడు.. ఇప్పుడు కూటి కోసం గేదెలు మేపుతున్నాడు.. ఎవరంటే?

Team India : ఒకప్పుడు ప్రపంచకప్ లో టీమిండియాకు ఆడాడు.. ఇప్పుడు కూటి కోసం గేదెలు మేపుతున్నాడు.. ఎవరంటే?

PC : TWITTER

PC : TWITTER

India 2022 t20 World cup Squad : భారత దేశం (India)లో క్రికెటర్లను దేవుళ్లతో కొలుస్తారు. టీమిండియా (Team India)కు ప్రాతినిధ్యం వహిస్తే చాలా తలరాతే మారిపోతుందని చాలా మంది భావిస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

India 2022 t20 World cup Squad : భారత దేశం (India)లో క్రికెటర్లను దేవుళ్లతో కొలుస్తారు. టీమిండియా (Team India)కు ప్రాతినిధ్యం వహిస్తే చాలా తలరాతే మారిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ (IPL)లీగ్ ఎంట్రీ ఇవ్వడంతో క్రికెటర్లపై కాసుల వర్షమే కురుస్తుంది. సినిమా సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గకుండా భారత క్రికెటర్లకు దేశంలో గుర్తింపు ఉంటుంది. ఇక ప్రపంచకప్ (World Cup) గెలిచిన జట్టునైతే గుండెళ్లో పెట్టుకొని తమ తర్వాతి తరాలకు కథలు కథలుగా చెబుతారు. అయితే ఇదంతా నాణెంకు ఒకవైపు మాత్రమే. టీమిండియా (Team India) ప్రాతినిధ్యం వహించిన ఎందరో క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఇక అంధుల క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అంధుల క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ బాలాజీ దామోర్ పరిస్థితి కూడా అలానే ఉంది.

1998లో జరిగిన అంధుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ లో బాలీజీ దామెర్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అద్బుత ప్రదర్శన కూడా చేశాడు. అందులో భారత్ సెమీఫైనల్ వరకు చేరుకుంది. సెమీస్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. 1998 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బాలాజీ దామోర్‌ను దివంగత మాజీ రాష్ట్రపతి కె. ఆర్.నారాయణన్ నుంచి అవార్డును కూడా అందుకున్నాడు. అంధుల క్రికెట్‌లో బాలాజీ దామోర్ అదిరిపోయే ప్రదర్శనే చేశాడు. 125 అంతర్జాతీయ మ్యాచ్‌ ల్లో 3,125 పరుగులు చేయడమే కాకుండా 150 వికెట్లు తీసి ఆల్ రౌండర్ గా జట్టును అనేక సార్లు గెలిపించాడు.

అయితే ప్రస్తుతం బాలాజీ దామోర్ పరిస్థితి దారుణంగా ఉంది. తినడానికి తిండిలేక పొట్ట కూటి కోసం తన గ్రామంలో గేదెలు,మేకలను మేపుతున్నాడు. ఒకప్పుడు ఆల్ రౌండర్ గా టీమిండియాకు విజయాలను అందించిన బాలాజీ ప్రస్తుతం గేదెలు, మేకలను మేపుతూ తన కడుపు నింపుకోవడం విచారకరం. స్పోర్ట్స్ కేటగిరీలో అతడికి ఉద్యోగం కూడా దక్కకపోవడం బాధపడాల్సిన అంశం.

బాలాజీ దామోర్ స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలోని పిప్రానా గ్రామం. ప్రస్తుతం అతడు తన గ్రామంలో పొలం పనులు చేస్తూ.. గేదెలు, మేకలను మేపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. బాలాజీ దామోర్ కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. బలాజీ దామోర్ ఇంట్లో కనీసం వంట పాత్రలు కూడా లేవంట. అంతేకాకుండా కుటుంబం మొత్తం నేలపైనే పడుకునే పరిస్థితి.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Cricket, Gujarat, Rohit sharma, Team India, Virat kohli, World cup

ఉత్తమ కథలు