హోమ్ /వార్తలు /క్రీడలు /

Yuvraj Singh : అంతరిక్షంలోకి యువరాజ్ మొదటి సెంచరీ చేసిన బ్యాట్.. వైరల్ వీడియో..

Yuvraj Singh : అంతరిక్షంలోకి యువరాజ్ మొదటి సెంచరీ చేసిన బ్యాట్.. వైరల్ వీడియో..

యువరాజ్ సింగ్ (ఫైల్ ఫోటో)

యువరాజ్ సింగ్ (ఫైల్ ఫోటో)

Yuvraj Singh : టీమిండియా సిక్సర్ల కింగ్.. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj singh) అరుదైన ఘనత సాధించాడు. స్పేస్ లోకి యువీ బ్యాట్ ను పంపారు. ఇప్పుడు ఈ వీడియో వైరలవుతోంది.

టీమిండియా సిక్సర్ల కింగ్.. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj singh) అరుదైన ఘనత సాధించాడు. అతడు తొలిసారి సెంచరీ బాదిన బ్యాట్ ను అంతరిక్షం (Space) లోకి పంపించింది ఆసియాకు చెందిన ఓ ఎన్​ఎఫ్​టీ (NFT) మార్కెట్​ కలెక్షన్​ సంస్థ.​ స్పేస్​లోకి వెళ్లిన తొలి బ్యాట్​ గా ఇది రికార్డు సృష్టించింది. యువరాజ్‌కు ఎన్​ఎఫ్​టీలను జారీ చేయడానికి కంపెనీ అతనితో లింక్ అప్ అయింది. ఈ బ్యాట్‌పై సాంకేతికంగా కొన్ని పరికరాలను కూడా అమర్చారు. అందులో మనం బ్యాట్‌ అంతరిక్షంలో ఎగురుతున్నట్లు చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సదరు సంస్థ షేర్​ చేసింది.

తాజాగా ఈ విషయంపై యువీ (Yuvi) స్పందించాడు. "నా బ్యాట్​ అంతరిక్ష ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్లాట్​ఫాంలో చేరడం వల్ల నా ఫ్యాన్స్ తో అనుబంధం మరింత పెరుగుతుంది. ఈ బ్యాట్​తోనే నేను తొలి సెంచరీ బాదాను. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో అభిమానులతో కనెక్ట్ అవ్వడం చాలా ఉత్సాహంగా ఉంది" అని అన్నాడు.

2003లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)​తో జరిగిన ఓ వన్డే మ్యాచ్​లో గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేవలం 85 బంతుల్లోనే 9ఫోర్లు, 4 సిక్సర్లతో తన తొలి సెంచరీని నమోదు చేశాడు యువరాజ్. బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ వాడిన బ్యాట్ ను ఇప్పుడు స్పేస్ (Space) లోకి పంపించారు.

NFT అంటే..?

ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ. డబ్బు విలువ మారకం తగ్గింది. అంతా ఆన్లైన్ వేదికలుగానే వర్తక, వ్యాపారాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కాయిన్స్, బిట్ కాయిన్, డిగో కాయిన్ వంటివి మార్కెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. రేపటి భవిష్యత్ అంతా వీటిదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇవి ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఎదుగుతున్నాయి. ఇదే క్రమంలో సెలబ్రిటీలు, ప్రముఖులకు సంబంధించిన మాటలు, పాటలు, నటన, ఇతరత్రా విషయాలకు సంబంధించిన విషయాలను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చుతారు. వీటిని బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఆన్లైన్ లో వేలం వేస్తారు. ఇదొక ఆర్ట్ వర్క్ వంటిది. యానిమేషన్ సాయంతో వీటిని తయారు చేస్తారు. వీటిని Non Fungible Tokensగా వ్యవహరిస్తారు.

క్రిప్టో కరెన్సీ మాదిరిగానే ఈ ఎన్ఎఫ్టీ లు భద్రంగా ఉంటాయి. ప్రముఖులకు సంబంధించిన ఈ డిజిటల్ ఆస్తులు.. వాటిని దక్కించుకున్న వారికే చెందుతాయి. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా పిలుస్తారు. అంతేగాక ఈ టోకెన్లతో క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేసుకునే వీలుంటుంది.

ఇది కూడా చదవండి : Team India ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ మళ్లీ వస్తున్నాడు..

ఇదిలాఉండగా.. టీమిండియాలో దినేశ్ కార్తీక్ తర్వాత ఎన్ఎఫ్టీ లో ఈ ఘనతను సాధించిన రెండో క్రికెటర్ గా యువీ రికార్డులకెక్కాడు. గతంలో దినేశ్ కార్తీక్.. బంగ్లాదేశ్ పై నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ లో భాగంగా 2018 మార్చిలో జరిగిన మ్యాచ్ లో 8 బంతుల్లో 29 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆఖరు బంతికి సిక్సర్ కొట్టిన కార్తీక్.. ఆ ఫ్లాట్ సిక్సర్ ను ఎన్ఎఫ్టీ రూపంలో లిఖించుకున్నాడు. భారత్ ను గెలిపించాక కార్తీక్ సెలబ్రేట్ చేసుకున్న విజయ క్షణాలు, అందుకు సంబంధించి అతడిలోని ఆలోచనలు, భావోద్వేగాలు ఎన్ఎఫ్టీ గా రానున్నాయి. కార్తీక్ భావోద్వేగాలను కలబోసిన NFT యానిమేషన్ రూపంలో పొందుపరిచారు.

First published:

Tags: Cricket, Dinesh Karthik, Team India, Viral Video, Yuvraj Singh

ఉత్తమ కథలు