TEAM INDIA FAST BOWLER MOHAMMED SHAMI SUPPORTED VIRAT KOHLI SAYS CENTURY IS NOT THE ONLY CRITERIA FOR HIM AK
Kohli: అవును.. కొహ్లి సెంచరీలు కొట్టడం లేదు.. అయితే ఏమిటన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్
విరాట్ కొహ్లి (ఫైల్ ఫోటో)
Virat Kohli: కొహ్లి శక్తి చాలా గొప్పదని.. అది జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా వస్తుందని షమీ కామెంట్ చేశాడు. అతను బౌలర్ కెప్టెన్ అని.. బౌలర్లకు కొహ్లి ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఇచ్చేవాడని అన్నాడు.
కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై 70వ సెంచరీ చేసిన కొహ్లి.. 2019 నవంబర్ 22 నుండి అంతర్జాతీయ క్రికెట్లో మరో సెంచరీ చేయలేదు. కొంతకాలంగా సెంచరీ చేయని కొహ్లి ఫామ్‌పై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొహ్లి అత్యుత్తమ ప్రదర్శన అతడిని మించిపోయిందా అని పలువురు ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక పరిణామాలు చోటు చేసుకోవడం.. కొహ్లి తన కెప్టెన్సీని కూడా వదులుకోవడం జరిగిపోయాయి. ఇక బీసీసీఐ చీఫ్ గంగూలీకి, కొహ్లికి మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. కొందరు కొహ్లి తీరును తప్పుబడుతుంటే.. మరికొందరు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కొహ్లికి మద్దతుగా నిలిచాడు. కొహ్లి సెంచరీ చేయకపోతే ఏమైందని ప్రశ్నించాడు. అతడు సెంచరీ చేస్తేనే పెద్ద అటగాడు అని అనుకోలేమని అన్నారు. ఇటీవల కాలంలో కొహ్లి నిలకడగానే ఆడుతున్నాడని షమీ అన్నాడు. కొన్ని హాఫ్ సెంచరీలు కూడా చేశాడని గుర్తు చేశాడు. చాలామంది ఇలా ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించాడు. హాఫ్ సెంచరీ, ఆపైన చేసే పరుగులు కూడా టీమ్‌ను పటిష్టమైన స్థితిలో ఉండేలా చేయడానికి సహకరిస్తామని షమీ అన్నాడు. అసలు కొహ్లిపై చాలామంది ఫిర్యాదులు చేయడానికి ఎలాంటి కారణాలు లేవని అన్నాడు.
జనవరిలో దక్షిణాఫ్రికాతో 1-2 రెడ్ బాల్ సిరీస్ ఓటమి తర్వాత కోహ్లి ఇటీవలే భారత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు ఆర్సీబీ క్రికెటర్ టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. త్వరలో వన్డేల్లో కీలక పాత్ర నుంచి తొలగించబడ్డాడు. భారత క్రికెట్ బోర్డు గత ఏడాది డిసెంబర్లో రోహిత్ శర్మను వైట్‌బాల్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రకటించింది.కోహ్లీ నాయకత్వంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు షమీ భారత కీలక బౌలర్లలో ఒకడుగా మారాడు. అతని సహచరుడి నాయకత్వ నైపుణ్యాలను మెచ్చుకుంటూ షమీ అతన్ని బౌలర్స్ కెప్టెన్ అని కొనియాడాడు.
కొహ్లి శక్తి చాలా గొప్పదని.. అది జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా వస్తుందని షమీ కామెంట్ చేశాడు. అతను బౌలర్ కెప్టెన్ అని.. బౌలర్లకు కొహ్లి ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఇచ్చేవాడని అన్నాడు. తమ అభిప్రాయాలను కొహ్లి ఎప్పుడూ గౌరవించేవాడని గుర్తు చేశాడు. క్రికెట్లో కొహ్లితో కలిసి తాము అనేక సమయం గడిపామని.. చాలా మరపురాని క్షణాలు ఉన్నాయని చెప్పాడు. మొత్తానికి కెరీర్లో ఇబ్బందిపడుతున్న కొహ్లికి షమీ నుంచి వచ్చిన సపోర్ట్ ఎంతవరకు ఊరట కలిగిస్తుందో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.