TEAM INDIA FANS SLAMS PAKISTAN FORMER CRICKETER RASHID LATIF FOR HIS COMMENTS AGAINST TEAM INDIA PLAYERS VIRAT KOHLI ROHIT SHARMA AND KL RAHUL SRD
Ind Vs Pak : మరోసారి నీచ బుద్ధిని బయటపెట్టిన పాక్ మాజీ కెప్టెన్.. టీమిండియాను తక్కువ చేస్తూ..
Ind Vs Pak (Twitter)
Ind Vs Pak : ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్ 2021(T20 World Cup 2021) లో పాక్ చేతిలో భారత్ (Team India) ఓడిన దగ్గర నుంచి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేసుకుని తమ నోటి దురదను బయటపెడుతున్నారు.
పాకిస్థాన్మాజీ క్రికెటర్లు (Pakistan Former Cricketers) ఈ మధ్య కాలంలో రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్ 2021(T20 World Cup 2021) లో పాక్ చేతిలో భారత్ (Team India) ఓడిన దగ్గర నుంచి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేసుకుని తమ నోటి దురదను బయటపెడుతున్నారు. టీమిండియా ఫ్యాన్స్ పై కూడా నోరు పారేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) చేరాడు. టీమిండియా ఫ్యాన్స్ ను ఉద్దేశించి నోరు పారేసుకున్నాడు. ఏకంగా భారత క్రికెటర్లను తక్కువ చేస్తూ మాట్లాడాడు. దీంతో భారత అభిమానులు అతనిపై ఫైరవుతున్నారు. అసలు రషీద్ చేసిన కామెంట్స్ ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత టీమిండియాలో పాకిస్థాన్ ఆటగాళ్లైనా మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), బాబర్ అజామ్ (Babar Azam) వంటి ఆటగాళ్లు లేరని భారత అభిమానులు బాధపడుతారని చెప్పుకొచ్చాడు.
ఓ టీవీ చానల్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి గతంలో పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), లోకేష్ రాహుల్ (KL Rahul) వంటి ఆటగాళ్లు లేరని బాధపడేవారని, కానీ కొన్ని రోజుల తర్వాత అచ్చం ఇలాగే భారత అభిమానులు కూడా బాధపడతారని లతీఫ్ వ్యాఖ్యానించాడు. అయితే లతీఫ్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. పాక్ ఆటగాళ్లకి అంత సీన్ లేదంటూ లతీఫ్ పై మండిపడుతున్నారు.
Rashid Latif
ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇద్దరు మంచి ఫామ్‌తో భారీగా పరుగులు చేసి పాకిస్థాన్‌ను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించారు. ఈ క్రమంలో వారు టీమిండియాకు చెందిన రోహిత్‌శర్మ, లోకేష్ రాహుల్ రికార్డును అధిగమించారు. ఇప్పటివరకు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ టీ20 ఫార్మాట్లో 6 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా, మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ 7 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి.. రోహిత్, రాహుల్‌ను అధిగమించారు.
అంతేకాకుండా పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది టీ20లో 2 వేల పరుగులు పూర్తిచేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అందులో అంతర్జాతీయ క్రికెట్లోనే వెయ్యికి పైగా పరుగులు ఉండడం విశేషం.
ఆ తర్వాతి స్థానంలో కూడా మరో పాకిస్థాన్ ఓపెనర్ అయినా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఉండడం గమనార్హం. అలాగే ఈ ఓపెనింగ్ జోడి ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ విసిరిన 152 పరుగుల లక్ష్యాన్ని ఈ జంట ఒక వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది.
అయితే, పాకిస్థాన్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన వెస్టిండీస్ జట్టులోని 9 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను అతిథ్య పాకిస్థాన్ 3-0తో గెలుచుకుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.