Suresh Raina - Ravindra Jadeja : మొదట తాము భారతీయులమనే విషయానని వారిద్దరూ గుర్తించుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరి వరకూ భారతీయుడిగానే జీవించాల్సి ఉంటుంది తప్ప.. కులం ప్రస్తావనను తీసుకుని రాకూడదని సూచిస్తున్నారు.
టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) ఒక క్రికెట్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియాలో సభ్యుల ఎంపికపై కూడా ఎప్పటి నుంచో పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకే కులానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తుందంటూ క్రికెట్ అభిమానులు కూడా అప్పుడప్పుడు దుమ్మెత్తి పోస్తుంటారు. ఇక లేటెస్ట్ గా ‘నేను కూడా బ్రాహ్మణుడినే’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సురేష్ రైనాకు వత్తాసుగా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ట్వీట్ చేసి ఈ వివాదాన్ని మరింత రగిల్చాడు. దీంతో ఈ చెన్నై ఆటగాళ్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక కులానికి మాత్రమే పరిమితమయ్యేలా తయారయ్యారంటూ మండిపడుతున్నారు. భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం సమంజసం కాదంటున్నారు. అభిమానులు, తోటి క్రికెటర్లను కులాలవారీగా విభజించి చూసే క్రికెటర్లను బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది క్రికెట్ నుంచి రిటైర్ అయిన సురేష్ రైనా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగుతోన్నాడు. రవీంద్ర జడేజా టీమిండియా విజయాల్లో కీ రోల్‌గా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టులో సభ్యుడతను. వారిద్దరూ సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రీమియర్ లీగ్ కొనసాగుతోన్న దశలో సురేష్ రైనా బ్రాహ్మణిజంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. దాన్ని సమర్థించేలా రవీంద్ర జడేజా ట్వీట్ చేయడం మరింత వివాదాస్పదమైంది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నాడు సురేష్ రైనా. తాను బ్రాహ్మణుడినంటూ కులాన్ని బయటపెట్టాడు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వాడినే అయినప్పటికీ- తమిళ బ్రాహ్మణుల అలవాట్లను సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నానని పేర్కొన్నాడు. తమిళ బ్రాహ్మణ సంస్కృతి, సంప్రదాయాలను తాను అమితంగా ప్రేమిస్తానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టీమ్ మేట్స్ అనిరుద్ధ్ శ్రీకాంత్, సుబ్రమణియన్ బద్రినాథ్, లక్ష్మీపతి బాలాజీలను తమిళ బ్రాహ్మణ సంప్రదాయాలను చాలా నేర్చుకున్నానని అన్నాడు. సంప్రదాయాలకు విలువను ఇచ్చే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగస్వామి కావడం గర్వంగా ఉందని, ఈ ఫ్రాంఛైజీ తరఫున మరిన్ని మ్యాచ్‌లను ఆడతానని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతను చేసిన ఈ వ్యాఖ్యలను రవీంద్ర జడేజా సమర్థించాడు. ఈ మేరకు అతను ఒక ట్వీట్ చేశారు. #Rajput boys forever అంటూ వ్యాఖ్యానించాడు.
Why do you have to take pride in being Rajput. Why not Human forever. This kind of sect will create division. Sections are not good.. unite as humans.
No proudness comes from birth, if you claim so then that's the biggest sickness. Be proud for what you had become and not with labels which they imposed on you.
దీంతో ఈ కులం వివక్షకు సంబంధించిన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేశాయ్. మొదట తాము భారతీయులమనే విషయానని వారిద్దరూ గుర్తించుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరి వరకూ భారతీయుడిగానే జీవించాల్సి ఉంటుంది తప్ప.. కులం ప్రస్తావనను తీసుకుని రాకూడదని సూచిస్తున్నారు. కోట్లాదిమందిని స్ఫూర్తిని నింపే క్రికెటర్లు ఇలా ఒక కులానికి పరిమితం కాకూడదని అంటున్నారు. అలాగే, ఈ ఇద్దరు క్రికెటర్లపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.