Home /News /sports /

TEAM INDIA FANS BRUTALLY TROLLS KL RAHUL CAPTAINCY SKILL AFTER WHITE WASH AGAINST SOUTH AFRICA SRD

KL Rahul : రాహులో రాహులా.. ఆగం చేశావురో.. నీ కెప్టెన్సీకో దండం..!

KL Rahul

KL Rahul

KL Rahul : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది. మూడు నెలల క్రితం టాప్ టీమ్‌గా ఉన్న భారత జట్టు, ఇప్పుడు రాహుల్ కెప్టెన్సీలో బీ గ్రేడ్ టీమ్‌లా పర్ఫామెన్స్ ఇచ్చింది.

    భారీ ఆశలతో దక్షిణాఫ్రికా (South Africa) గడ్డపై అడుగుపెట్టిన భారత్ (Team India) కు నిరాశే ఎదురైంది. 30 ఏళ్ల చరిత్ర సృష్టించాలనే ఆశలు కాస్త చెడిపోయాయి. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. వన్డే సిరీస్ లో అయితే వైట్ వాష్ అయింది టీమిండియా. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది.దీంతో ఆతిథ్య జట్టు 3-0తో తిరుగులేని ప్రదర్శన చేసింది. వన్డే సిరీస్ కు గాయం కారణంగా రోహిత్ శర్మ (Rohit Sharma) దూరం కాగా.. కేఎల్ రాహుల్ భారత వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. రోహిత్ శర్మ గైర్హ‌జ‌రీలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన కేఎల్ రాహుల్ (KL Rahul) అత్యంత చెత్త రికార్డును న‌మోదు చేశాడు. మెద‌టి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత కెప్టెన్‌గా రాహుల్‌ నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భార‌త కెప్టెన్ కూడా త‌న తొలి మూడు వ‌న్డేలు ఓడిపోలేదు.

    దీంతో ఆ చెత్త రికార్డు రాహుల్పేరుపై నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గా కూడా రాహుల్ విఫ‌ల‌మ‌య్యాడు. మూడు వన్డేల్లో వరుసగా 12, 55, 9 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 55 పరుగులు చేసినా.. అందుకు 79 బంతులు తీసుకున్నాడు. అయితే, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై నెట్టింట ట్రోలింగ్ న‌డుస్తోంది. రాహుల్ కెప్టెన్‌గా ఎక్క‌డా ఉన్న స‌రే ఆ జ‌ట్టు ఓడిపోతుంద‌ని, దీంతో రాహుల్‌ది ఐర‌న్ లెగ్ అంటూ నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

    ప్ర‌స్తుతం ఈ ట్రోలింగ్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. వన్డేల కన్నా ముందు టెస్ట్ సిరీస్‌లోనూ రెండో మ్యాచ్‌లో రాహుల్ జ‌ట్టును న‌డిపించాడు. అంత‌కు ముందు తొలి టెస్టులో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రాహుల్ కెప్టెన్సీలో ఆడిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది.అలాగే అంత‌కుముందు ఐపీఎల్‌లోనూ కింగ్స్‌కు రాహుల్ నాయ‌క‌త్వం వ‌హించాడు. అక్క‌డ కూడా కెప్టెన్‌గా త‌న తొలి మ్యాచ్‌ను రాహుల్ ఓట‌మితోనే ప్రారంభించాడు.


    దీంతో అభిమానులు రాహుల్‌ది ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కెప్టెన్సీలో జ‌ట్టు గెల‌వ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు. నిజానికి బ్యాట‌ర్‌గా రాహుల్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. మంచి ఓపెన‌ర్‌గా ఆయా జ‌ట్ల‌కు ఎక్క‌డా ఆడిన భారీగా ప‌రుగులు చేశాడు. కానీ కెప్టెన్‌గా మాత్రం రాణించ‌లేక‌పోతున్నాడు. ఐపీఎల్‌లో అయితే బ్యాటర్ గా రాహుల్ అద‌ర‌గొట్టిన మ్యాచ్‌ల్లో కూడా కెప్టెన్‌గా పంజాబ్‌ జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు.




    అంతేకాకుండా పంజాబ్ కింగ్స్ జ‌ట్టును ఐపీఎల్‌లో ఒక్క సారి కూడా క్వాలిఫైయ‌ర్ రౌండ్‌లోకి తీసుకెళ్ల లేక‌పోయాడు. తాజాగా భార‌త జ‌ట్టుకు కూడా విజ‌యాల‌ను అందించ‌లేక‌పోవ‌డంతో రాహుల్ కెప్టెన్సీపై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. రాహుల్‌ది ఐర‌న్ లెగ్ అంటూ నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. మూడు నెలల క్రితం టాప్ టీమ్‌గా ఉన్న భారత జట్టు, ఇప్పుడు రాహుల్ కెప్టెన్సీలో బీ గ్రేడ్ టీమ్‌లా పర్ఫామెన్స్ ఇస్తోంది. దీంతో రాహుల్ అంటే కెప్టెన్ అనుకుంటివా కాదు డమ్మీ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

    ఇది కూడా చదవండి : తగ్గేదే లే.. మెగావేలంలో ఈ భారత ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం..!

    మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా రాహుల్ కెప్టెన్సీపై ఫైరయ్యాడు. ఒత్తిడికి రాహుల్ చిత్తవుతున్నాడని.. ఒత్తిడిలో అతని తీసుకునే నిర్ణయాలు టీమిండియాకు చేటు చేస్తున్నాయని మండిపడుతున్నాడు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. రాహుల్‌ని కెప్టెన్‌గా చేస్తే భవిష్యత్తులో టీమిండియా ఆటతీరు ఇలా ఉండబోతుందా? అని భయపడుతున్నారు. టీమిండియా భ‌విష్య‌త్ కెప్టెన్‌గా పేరు ఉండ‌డంతోపాటు ప్ర‌స్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ నుంచి ఇలాంటి ఫేల‌వ కెప్టెన్సీ మంచి ప‌రిణామం కాద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs South Africa, KL Rahul, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు