Home /News /sports /

నేను ధోనీ అభిమానిని.. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్

నేను ధోనీ అభిమానిని.. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్

ఎంఎస్ ధోనీ, మహమ్మద్ కైఫ్

ఎంఎస్ ధోనీ, మహమ్మద్ కైఫ్

2002లో యువరాజ్ సింగ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను కైఫ్ అభిమానులకు చూపించారు. ప్లేయర్ ఫిట్‌గా ఉంటే 40 ఏళ్ల వరకు ఆడొచ్చని, కేఎల్ రాహుల్ చాలా ఫిట్‌గా ఉంటాడని చెప్పారు.

    సక్సెస్‌కి షార్ట్ కట్ ఉండదన్నారు భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. విజయం సాధించాలంటే ఎంతో కష్టపడాలి, కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందని చెప్పారు. భారత్ తరఫున ఆడేందుకు ఎంతో మంది యువకులు వేచి చూస్తున్నారని తెలిపారు కైఫ్. మహమ్మద్ కైఫ్ గురువారం #Helo లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో భార్యకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. 2004లో పాక్ పర్యటనలో ఆడిన ఇన్నింగ్స్ తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని.. ఇండియన్ టీ20 లీగ్‌లో దిల్లీకి కోచ్‌గా వ్యవహరించడం గొప్ప అనుభమన్నాని అన్నారు.

    దాదా ముక్కుసూటి మనిషి. తక్కువ సమయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. కరోనా కారణంగా క్రికెట్‌ని చాలా మిస్సవుతున్నాం. మహేంద్ర సింగ్ ధోనీకి నేను అభిమానిని. టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ... కంగారూల గడ్డపై జరుగుతుంది కాబట్టి ఆసీస్ జట్టుకు అవకాశం ఉంది. హార్దిక్, పాండ్య, రోహిత్ లాంటి ఆటగాళ్లు ఉన్న భారత జట్టు కూడా ఫేవరెట్ జట్టే.
    మహమ్మద్ కైఫ్


    2002లో యువరాజ్ సింగ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను కైఫ్ అభిమానులకు చూపించారు. ప్లేయర్ ఫిట్‌గా ఉంటే 40 ఏళ్ల వరకు ఆడొచ్చని, కేఎల్ రాహుల్ చాలా ఫిట్‌గా ఉంటాడని చెప్పారు. లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ తమ హయాంలో ఎంతో ఫిట్‌గా ఉండేవారని తెలిపారు. అనంతరం తన లవ్ స్టోరీ గురించి చెప్పారు మహమ్మద్ కైఫ్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, HELO, Ms dhoni, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు