HOME »NEWS »SPORTS »team india ex cricketer gautam gambhir slams delhi government and aap speculations over his political entry

ఆమాద్మీ సర్కార్‌పై గంభీర్ సెటైర్లు...ఢిల్లీ డైనమెట్ బీజేపీలో చేరతాడా?

ఆమాద్మీ సర్కార్‌పై గంభీర్ సెటైర్లు...ఢిల్లీ డైనమెట్ బీజేపీలో చేరతాడా?
గౌతం గంభీర్ (ఫైల్ ఫొటో)

  • Share this:
    టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దేశ రాజకీయాలపై ట్విటర్‌లో బ్యాటింగ్ చేస్తూ కాకా రేపుతుంటారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు గంభీర్. ''నేను ఢిల్లీవాసిని. ఫుట్‌పాత్‌లపై వణుకుతున్నా. నేను ఢిల్లీ వాసిని. ఆస్పత్రుల్లో పాకుతున్నా. నేను ఢిల్లీ వాసిని. వ్యవస్థలతో పోరాడుతున్నా. నేను ఢిల్లీవాసిని కలుషిత గాలిని పీలుస్తూ ఇబ్బందులుపడుతున్నా. నేను ఢిల్లీవాసిని. ఖాదీ వస్త్రాల వెనక నగ్నత్వాన్ని దాచుకుంటున్నా. నేను ఢిల్లీ వాసిని.'' అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
    గౌతం గంభీర్‌పై అంతేస్థాయిలో ఎదురుదాడికి దిగింది ఆమాద్మీ పార్టీ. గంభీర్‌కు దుమ్ముంటే వీధుల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కళ్లారా చూడాలని ఆమాద్మీ సోషల్ మీడియా వ్యూహకర్త అంకిత్ లాల్ సవాల్ విసిరారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
    అటు ఆమాద్మీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ సైతం గంభీర్‌పై నిప్పులు చెరిగారు. రాత్రిపూట రోడ్లపైకి వెళ్లి నైట్ షెల్టర్లు వంటి ప్రభుత్వ సదుపాయాలను చూడాలని...అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


    గంభీర్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని..ఆయన బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ ప్రభుత్వంపై టార్గెట్ చేయడాన్ని చూస్తుంటే..ఆయన త్వరలోనే కమలం గూటికి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.


    First published:January 21, 2019, 22:01 IST

    टॉप स्टोरीज