Cricketer's Pet Dogs: కుక్కలు.. క్రికెటర్లకు మంచి స్నేహితులు.. టీమ్ ఇండియాలో పెరిగిన పెట్ లవర్స్

క్రికెటర్లు.. మంచి పెట్ లవర్స్ అంటా.. ఎవరి వద్ద ఎన్నికుక్కలు ఉన్నయో తెలుసా? (PC: Instagram)

Cricketer's Pet Dogs: ఇటీవల కాలంలో క్రికెటర్లు తమ ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం హాబీగా మార్చుకున్నారు. ఏడాదంతా దేశ, విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండే క్రికెటర్లు.. ఇంటికి రాగానే తమ పెట్స్‌తో సరదాగా గడుపుతున్నారు. టీమ్ ఇండియా ప్రతీ క్రికెటర్ వద్ద కనీసం ఒక కుక్క అయినా ఉంది.

 • Share this:
  ఒకప్పుడు కుక్కలను స్టేటస్ సింబల్‌గానో.. ఇంటికి రక్షణ కోసమో పెంచుకునే వాళ్లు. కానీ కాలక్రమేణా కుక్కలను పెంచుకోవడం ఒక హాబీలా మారిపోయింది. ధనవంతుల ఇళ్లల్లోనే కాకుండా మామూలు మధ్య తరగతి ఇళ్లల్లో కూడా కుక్కలను పెంచడం పరిపాటి అయ్యింది. ముఖ్యంగా కుక్కలను రక్షణ కోసం కంటే ఒక కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇంట్లో చిన్నపిల్లలకు ఒక మంచి ఫ్రెండ్‌గా.. పెద్ద వాళ్లకు తోడుగా ఉంటూ వస్తున్నాయి. టీమ్ ఇండియా (Team India) క్రికెటర్లలో (Cricketers) కూడా చాలా మంది పెట్ లవర్స్ (Pet Lovers) ఉన్నారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు క్రికెటర్లలో కుక్కలను పెంచే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది క్రికెటర్ల ఇళ్లల్లో కనీసం ఒక పెంపుడు కుక్క అయినా ఉంటున్నది. విరాట్ కోహ్లీ (Virat Kohli), సచిన్ (Sachin Tendulkar), హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ (MS Dhoni), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (KL Rahul) వంటి క్రికెటర్లే కాకుండా కోచ్ రవిశాస్త్రి కూడా మంచి పెట్ లవర్. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దశాబ్దంపైగా కుక్కలను పెంచుతున్నాడు. 11 ఏళ్ల పాటు విరాట్‌ పెంచిన బర్నో అనే కుక్క.. ఇటీవలే మరణించింది. దీంతో కోహ్లీ చాలా అప్‌సెట్ అయ్యాడు. కోహ్లీ, అనుష్క తమ పెంపుడు కుక్క బర్నో చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించి చాలా బాధపడ్డారు. ఇక టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వద్ద కూడా కుక్కలు ఉన్నాయి. రోహిత్‌తో పాటు అతని భార్య రితిక కూడా మంచి పెట్ లవర్. రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. ముంబైలోని కొలాబాలో రితిక తల్లిదండ్రులు నివసిస్తుంటారు. వాళ్ల దగ్గర మ్యాజిక్ అనేకుక్క ఉన్నది. రోహిత్, రితికి ఎప్పుడు ఆ ఇంటికి వెళ్లినా మ్యాజిక్ చాలా ఆప్యాయంగా వాళ్ల దగ్గరకు వస్తుందని గురునాథ్ చెబుతున్నారు. రోహిత్ కూతురు కూడా మ్యాజిక్‌తో సరదాగా గడుపుతుందట.

  రోహిత్ శర్మ ఎప్పుడు తన అత్తమామల ఇంటికి వెళ్లినా మ్యాజిక్‌తోనే ఎక్కువ సమయం గడుపుతాడని తండ్రి గురునాథ్ చెబుతున్నాడు. ఇక మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా మంచి పెట్ లవర్. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పప్పీ ఫొటో షేర్ చేశాడు. తన పప్పీతో గడపడం తనకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది అని ఆ పోస్టులో రాసుకొని వచ్చాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వద్ద సెయింట్ బెర్నాడ్ జాతికి చెందిన కుక్క ఉన్నది. ఇటీవల మనాలీ విహార యాత్రకు వెళ్లిన సచిన్ టెండుల్కర్ తన పెట్‌ను కూడా వెంట తీసుకొని వెళ్లడం గమనార్హం. మరో మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇంట్లో కూడా కుక్క ఉన్నది. ఇటీవల తన కూతురు కుక్క పిల్లలతో ఆడుకుంటున్న ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సురేష్ రైనా ఇంట్లో ఉన్న కుక్కపేరు జాకీ. గత ఆరు నెలలుగా జాకీ సురేష్ రైనా కుటుంబంతో కలసి ఉంటుంది. ఈ కుక్కను సురేష్ రైనాకు అతడి సోదరుడు దినేశ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. జాకీ వచ్చిన దగ్గర నుంచి సురేష్ రైనా ఇంట్లో సందడి నెలకొన్నది.

  ఇక టీమ్ ఇండియాలో అతిపెద్ద పెట్ లవర్ ఎంఎస్ ధోనీ. రాంచీలోని అతడి ఫామ్ హౌస్‌లో చాలా కుక్కలను పెంచుతున్నాడు. ధోనీ, సాక్షి, కూతురు జీవా చాలా సార్లు కుక్కలతో కలసి ఉన్న ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జీవా ఎప్పుడూ కుక్కలతో గడపడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. ఇక కోచ్ రవిశాస్త్రి కూడా చాలా పెద్ద పెట్ లవర్. అతడి వద్ద 5 పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలకు వెరైటీ పేర్లు కూడా పెట్టాడు. బౌన్సర్, బీమర్, ఫ్లిప్పర్, స్కిప్పర్, యార్కర్ పేర్లతో ఉన్న కుక్కలను రవిశాస్త్రి పెంచుతున్నాడు. ప్రస్తుతం సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి తన పెంపుడు కుక్కలను చాలా మిస్ అవుతున్నానని ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇక వీరితో పాటు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా తరచూ తమ పెంపుడు కుక్కల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

  Virat Kohli Wicket: విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్లు ఎవరో తెలుసా? కోహ్లీ వికెట్ తీసిన టాప్ 6 బౌలర్లు

  Published by:John Naveen Kora
  First published: