Home /News /sports /

TEAM INDIA CRICKETERS FROM VIRAT KOHLI TO HARDIK PANDYA INDIAN CRICKETERS WISH COUNTRYMEN HAPPY INDEPENDENCE DAY SJN

Independence Day 2022 : మేరా భారత్ మహాన్.. భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు

PC : TWITTER

PC : TWITTER

Independence Day 2022 : చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) జరుపుకుంటున్నారు. ఇంగ్లండ్ (England) వేసిన బానిస సంకెళ్లను విడిపించుకుని స్వేచ్ఛా వాయువును పీల్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతావని.. ఆగస్టు 15వ తేదీని ఈసారి ఘనంగా జరుపుకుంది.  

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Independence Day 2022 : చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) జరుపుకుంటున్నారు. ఇంగ్లండ్ (England) వేసిన బానిస సంకెళ్లను విడిపించుకుని స్వేచ్ఛా వాయువును పీల్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతావని.. ఆగస్టు 15వ తేదీని ఈసారి ఘనంగా జరుపుకుంది.  75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను కూడా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిలోనూ జాతీయ జెండాను ఎగరవేసేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూాడా ఘనంగా నిర్వహించింది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని భారతీయులకు టీమిండియా (Team India) క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా భారతీయ సహోదరులకు ఇండిపెండెన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయుడిగా గర్విస్తున్నా

’భారతీయుడిగా గర్విస్తున్నా‘ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా భారతీయులకు  స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ప్రస్తుత సారథి రోహిత్ శర్మ అయితే జాతీయ జెండాను చేతబట్టి భారతీయులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేశాడు. జింబాబ్వే పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ ప్రత్యేక సందేశంతో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు.













వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, జింబాబ్వే పర్యటనకు తాత్కాలిక టీమిండియా కోచ్ గా ఎంపికైన వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారతీయులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, Independence Day 2022, Jasprit Bumrah, Rohit sharma, Shikhar Dhawan, Team India, Virat kohli, VVS Laxman

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు