• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • TEAM INDIA CRICKETER YUZVENDRA CHAHALS PARENTS TESTS CORONA POSITIVE AND HIS FATHER IN HOSPITAL SRD

Corona : టీమిండియాను వదలని మహమ్మారి...చాహల్ పేరెంట్స్ కు కరోనా..తండ్రి పరిస్థితి విషమం..

Corona : టీమిండియాను వదలని మహమ్మారి...చాహల్ పేరెంట్స్ కు కరోనా..తండ్రి పరిస్థితి విషమం..

Corona : టీమిండియాను వదలని మహమ్మారి...చాహల్ పేరెంట్స్ కు కరోనా..తండ్రి పరిస్థితి విషమం..

Corona : దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ల కుటుంబాల్ని పాపిష్టి కరోనా..వెంటాడుతోంది.

  • Share this:
    దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ల కుటుంబాల్ని పాపిష్టి కరోనా..వెంటాడుతోంది. లేటెస్ట్ గా టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్‌ పేరెంట్స్‌ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని చహల్‌ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. చహల్‌ తల్లి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. చహల్‌ తండ్రికి మాత్రం లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. ఇదే విషయంపై ధనశ్రీ మాట్లాడుతూ.. "మా మామగారు, అత్తగారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అత్తయ్య స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మామయ్య పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉండండి.. మాస్క్‌ ధరించి క్షేమంగా ఉండండి'' అంటూ చెప్పుకొచ్చింది.

    ఇటీవలే మాజీ క్రికెటర్లు పియూష్‌ చా‍వ్లా, ఆర్‌పీ సింగ్‌లు కరోనాతో తన తండ్రులను కోల్పోయారు. టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తన అమ్మను, సోదరి కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రద్దు తర్వాత చాహల్ రీసెంట్ గా ఇంటికి చేరుకున్నాడు. ముందుగా ఆర్సీబీ, కోల్ కతా మ్యాచ్ ను వాయిదా వేసిన బీసీసీఐ.. ఎట్టకేలకు టోర్నమెంట్ నే రద్దు చేసింది. ఎలాగూ టెస్టు స్క్వాడ్ లో లేని చాహల్.. ఇంటి పట్టునే ఉండనున్నాడు.కొద్ది నెలలు ఇంటి దగ్గరే ఉండి తర్వాత శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల కోసం బయల్దేరనున్నాడు చాహల్.
    Published by:Sridhar Reddy
    First published: