టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు, రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈఘటనలో స్వల్ప గాయాలతో క్రికెటర్ సేఫ్‌గా బయటపడ్డాడు. రిషబ్‌పంత్ యాక్సిడెంట్‌పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు సూచించారు.
తెల్లవారు జామునే ప్రమాదం..
ఉత్తరాఖండ్‌లోని మంగళూరు సమీపంలో డిసెంబర్ 30వ తేది శుక్రవారం రోజు ఉదయం 5.15 గంటల ప్రాంతంలో క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. క్రికెటర్ కారు ప్రమాదానికి గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తదుపరి తనిఖీల కోసం అతన్ని డెహ్రాడూన్‌కు తీసుకువస్తున్నారు. అయితే కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
తీవ్రగాయాలు..
మరోవైపు క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు పంత్ యాక్సిడెంట్ వార్తపై దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రిషబ్ పంత్‌కి ధైర్యం చెబుతూ , ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో మెసేజ్‌లు చేస్తున్నారు. ఇక రిషబ్ పంత్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rishabh Pant