భారత స్టార్ క్రికెటర్లో ఒకడైన హార్ధిక్ పాండ్యా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈ రోజు కన్నుమూశారు. తండ్రి హఠాన్మరణంలో హార్ధిక్ పాండ్యా సోదరుడు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న క్రునాల్ పాండ్యా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈవో శిశిర్ హట్టంగడి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదం కారణంగా బరోడా టీమ్ తరపున రాబోయే టీ20 టోర్నమెంట్ ఆడే అవకాశం లేదని వెల్లడించారు. హార్ధిక్ పాండ్యా తరహాలోనే క్రునాల్ పాండ్యా కూడా మంచి ఆల్ రౌండర్. ముస్తాక్ అలీ టోర్నమెంట్లో మూడు మ్యాచ్‌లు ఆడిన క్రునాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో బరోడా తరపున 76 పరుగులు చేశాడు. క్రునాల్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ బరోడా జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో పాల్గొనని హార్ధిక పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరగబోయే టోర్నీ కోసం కసరత్తు చేస్తున్నాడు.
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హార్ధిక్ పాండ్యా.. తనదైన బ్యాటింగ్ శైలితో క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకున్నాడు. క్రికెట్‌తో పాటు తనదైన స్టయిలిష్ లుక్‌తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ వచ్చాడు హార్ధిక్. గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిక్‌తో కొన్ని నెలలుగా సహజీవనం చేసిన హార్ధిక్ గతేడాది తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం గర్ల్ ప్రెండ్, కుమారుడితో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా తండ్రి చనిపోవడంతో.. అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Published by:Kishore Akkaladevi
First published:January 16, 2021, 10:34 IST