మంత్రి కేటీఆర్‌కు క్రికెటర్ ఫిర్యాదు.. HCA పై సంచలన ఆరోపణలు

HCAలో అవినీతిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రికెట్ పాలకుల్లో చాలా మందిపై ఏసీబీ కేసులున్నాయని.. అలాంటి వారున్న చోట క్రికెట్ ఎలా ఎదుగుతుందని విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: November 23, 2019, 4:38 PM IST
మంత్రి కేటీఆర్‌కు క్రికెటర్ ఫిర్యాదు.. HCA పై సంచలన ఆరోపణలు
కేటీఆర్, రాయుడు
  • Share this:
టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు HCA (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు అంబటి రాయుడు. HCAలో అవినీతిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రికెట్ పాలకుల్లో చాలా మందిపై ఏసీబీ కేసులున్నాయని.. అలాంటి వారున్న చోట క్రికెట్ ఎలా ఎదుగుతుందని విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ గారు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు దృష్టిసారించాలని, దానిని నిర్మూలించాలని కోరుతున్నా. అవినీతి పాలకులు, డబ్బు క్రికెట్ జట్టుపై ప్రభావం చూపిస్తుంటే మన హైదరాబాద్ గొప్పతనం ప్రపంచానికి ఎలా తెలుస్తుంది. పాలకులపై ఎన్నో ఏసీబీ కేసులున్నాయి. వాటిని దాచిపెట్టారు.
అంబటి రాయుడు
కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని కొన్ని రోజుల క్రితం ఆరోపణలు వినిపించాయి. ఇక ఇటీవలే జరిగిన HCA ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్యానెల్ విజయం సాధించిది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ..ఈ ఎన్నికల్లో HCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అజారుద్దీన్. ఇక ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న కారణంతో క్రికెట్ నుంచి తప్పుకొని మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు అంబటిరాయుడు. ఆ సందర్బంగా టీమిండియా సెలక్షన్ కమిటీపైనా తన దైనశైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>