హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : ఈ చిచ్చర పిడుగు ముందు ఏ మిస్టరీ స్పిన్నర్ కూడా పనికిరాడు..! తన స్పిన్ తో సచిన్ నే ఫిదా చేశాడు..!

Viral Video : ఈ చిచ్చర పిడుగు ముందు ఏ మిస్టరీ స్పిన్నర్ కూడా పనికిరాడు..! తన స్పిన్ తో సచిన్ నే ఫిదా చేశాడు..!

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.

  క్రికెట్(Cricket) అంటేనే ఓ అద్భుతం అంటారు. ఇక, భారతదేశంలో ఈ జెంటిల్ మేన్ గేమ్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. భారత్ లో క్రికెట్ ఓ మతం. అది సీనియర్ లెవల్ అయినా, జూనియర్ క్రికెట్ అయినా విజయం సాధిస్తే ఓ రేంజిలో సంబరాలు చేస్తుంటారు. ఇక, 1983 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఉండే క్రేజే తారాస్థాయికి చేరింది. ఆ మెగాటోర్నీ విజయం కోట్లాది భారతీయుల్లో క్రికెట్ ను ఓ మతంలా మార్చింది. క్రికెటర్లును దేవుళ్లులా కొలిచే సంప్రదాయం అప్పటి నుంచే మొదలైంది. ఇక, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ను క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటాడు. సచిన్ ని చూసే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), కేన్ విలియమ్సన్ (Kane Williamson) లాంటి స్టార్ ఆటగాళ్లు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, ఐపీఎల్ భారత్ క్రికెట్ లో ఓ విప్లవాన్ని సృష్టించింది. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది కుర్రాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఇక, భారతదేశంలో చాలా మంది కుర్రాళ్లు క్రికెట్ నే ఓ కెరీర్ గా ఎంచుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యం ఎక్కడిక్కడా వెలుస్తున్న క్రికెట్ కోచింగ్ సెంటర్లు, క్రికెట్ అకాడమీలు.

  ఇక, లేటెస్ట్ గా ఓ చిచ్చర పిడుగు ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నే ఫిదా చేశాడు. అంతే కాకుండా తన స్పిన్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. స్పిన్ అంటే బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాటర్లు కళ్లు మూసి తెరిసేలోపు బాల్ వికెట్లను గిరాటేయాలి. ఈ వీడియో లో కనిపిస్తున్న అబ్బాయి కూడా అచ్చం అదే చేస్తున్నాడు. బౌలింగ్ వేయడానికి 22 యార్డ్స్ సర్కిల్ లేకున్నా.. అత్యాధునిక సదుపాయాలు లేకున్నా.. ఎటువంటి ప్రదేశంలోనైనా బంతిని స్పిన్ చేస్తున్నాడు.

  కంకర రోడ్డు మీద, పచ్చి గడ్డి మీద బాల్ ను స్పిన్ చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. తన బౌలింగ్ తో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో పాటు ఆసీస్ స్పీడ్ బౌలర్ బ్రెట్ లీ (Brett Lee) ని కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏకంగా సచిన్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడం గమనార్హం. ఈ వీడియోను సచిన్ షేర్ చేస్తూ.. " ఒక మిత్రుడి నుంచి ఈ వీడియోను పొందాను. ఈ చిన్నపిల్లోడికి క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి స్పష్టంగా తెలుస్తున్నాయి" అని పేర్కొన్నాడు.


  ఇక, ఈ వీడియోను చూసిన చాలా మంది సెలబ్రిటీలు అతని స్పిన్ నైపుణ్యానికి ఫిదా అవుతున్నారు. భవిష్యత్తు సూపర్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. మరి కొందరు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్లను మించిపోయేలా ఈ పిల్లాడు ఉన్నాడంటూ కితాబిస్తున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Sachin Tendulkar, Viral Videos

  ఉత్తమ కథలు