హోమ్ /వార్తలు /క్రీడలు /

Ravi Shastri: త్వరలో కోహ్లీ సేనకు కొత్త కోచ్.. గుడ్ బై చెప్పనున్న రవిశాస్త్రి.. రేసులో ఉన్నది వీళ్లే...

Ravi Shastri: త్వరలో కోహ్లీ సేనకు కొత్త కోచ్.. గుడ్ బై చెప్పనున్న రవిశాస్త్రి.. రేసులో ఉన్నది వీళ్లే...

Virat Kohli - Ravi Shastri

Virat Kohli - Ravi Shastri

ఈ విషయంపై ఇప్పటికే పూర్తి క్లారిటీతో ఉన్న రవిశాస్త్రి (Ravi Shastri) తన నిర్ణయాన్ని బీసీసీఐ (BCCI) పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది.

  టీమిండియాకు (Team India) త్వరలో కొత్త కోచ్ (New Coach for Team India) రానున్నారు. అదేంటి ప్రస్తుతం కోచ్ పదవిలో రవిశాస్త్రి (Coach Ravi Shastri) ఉన్నారుగా అనుకుంటున్నారు. త్వరలోనే రవిశాస్త్రి తన పదవికి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ (T20 World Cup-2021) తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కోచ్ గా కొనసాగేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పూర్తి క్లారిటీతో ఉన్న రవిశాస్త్రి తన నిర్ణయాన్ని బీసీసీఐ (BCCI) పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి నిర్ణయంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. త్వరలోనే కోచ్ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే రవిశాస్త్రి రాజీనామా చేయనున్నాడు. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ (Bowling Coach Bharath Arun), ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ (Fielding Coach R.Sridhar) కూడా తప్పుకోనున్నారు.

  టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి 2017లో నియమితులయ్యారు. 2019 ఆగస్టులో ఆయన పదవీకాలం ముగియగా.. బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగించింది. దీంతో ఆయన పదవీకాలం టీ20 ప్రపంచ కప్ అనంతరం ముగుస్తుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. అనంతరం కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటారు. రవిశాస్త్రితో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు తప్పుకోనుండగా.., బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం కొనసాగే అవకాశముంది.

  ఇది చదవండి: కొత్తలుక్ లో కోహ్లీ సేన.. మారిన ఆర్సీబీ జెర్సీ.. ఆ ఒక్క మ్యాచ్ కోసమే...


  రవిశాస్త్రి నిర్ణయంతో బీసీసీఐ కోచ్ వేటను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే కోచ్ ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. తొలుత దరఖాస్తులు ఆహ్వానించి అనంతరం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది.

  ఇది చదవండి: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ పేరుతో ఉన్న ఓ చెత్త రికార్డు తెలుసా?


  రేసులో మాజీ స్టార్స్..

  కోచ్ రేసులో ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) కోచ్ రేసులో ముందున్నాడు. ఎన్.సీ.ఏ డైరెక్టర్ గా, జూనియర్ టీమ్ కోచ్ గా సేవలందించిన ద్రావిడ్ హెడ్ కోచ్ అవడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అలాగే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

  డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ నాటికి కొత్త హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ లు బాధ్యతలు తీసుకునే అవకాశముంది. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగే రెండు టెస్టుల సిరీస్ ముగిసే వరకు అంటే నెలరోజుల పాటు రవిశాస్త్రిని కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Cricket, Ravi Shastri, Sports

  ఉత్తమ కథలు