'మళ్లీ బ్యాట్ పట్టుకోను'-విరాట్ కొహ్లీ

భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ ఏం చేసినా సంచలనమే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతోన్న కొహ్లీ తన రిటైర్మెంట్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

news18-telugu
Updated: January 11, 2019, 1:56 PM IST
'మళ్లీ బ్యాట్ పట్టుకోను'-విరాట్ కొహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Image: Reuters)
news18-telugu
Updated: January 11, 2019, 1:56 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 'మళ్ళీ బ్యాట్ పట్టుకోను' అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో భారత సారధి ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతోన్న విరాట్ అప్పుడే రిటైరవ్వడమేంటని కంగారూ పడితే పొరపాటే. బ్యాట్స్‌మన్‌గా సెంచరీల మోత మోగిస్తూ....కెప్టెన్‌గా చరిత్రను తిరగరాస్తున్న కొహ్లీకి ఇప్పుడప్పుడే రిటైరయ్యే ఆలోచనే లేదు. సిడ్నీ వన్డేకు ముందు కెప్టెన్స్ ప్రెస్ మీట్‌లో...రిటైర్మెంట్ అయితే తర్వాతి రోజు మీరేం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్‌లో బదులిచ్చాడు. తనకు రిటైర్మెంట్ ప్లాన్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని...ఆటకు గుడ్‌బై చెప్పేంతలా తాను క్రికెట్ ఆడలేదన్నాడు. గత ఐదేళ్లుగా గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడుతున్నానని..ఒకవేళ రిటైరైన తర్వాతి రోజు ఏం చేస్తానో తెలియదన్నాడు.

"ఒక వేళ రిటైరైతే మాత్రం తర్వాతి రోజు నుంచి మళ్లీ బ్యాట్ పట్టుకోను. గుడ్ బై చెప్పిన తర్వాత నేను తిరిగి క్రికెట్ ఆడే చాన్స్ ఉండదు. ఒక్కసారి రిటైరైతే ఇక అంతే సంగతులు.." అన్నాడు.
ఇదే ప్రెస్ మీట్‌లో 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ చేసిన అభ్యంతరకర కామెంట్స్‌పై స్పందించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టు కెప్టెన్‌గా చరిత్రను తిరగరాసిన విరాట్...ప్రస్తుతం వన్డే సిరీస్‌ మీద ఫోకస్ పెట్టాడు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...