Home /News /sports /

Virat Kohli : భార్య అనుష్క శర్మ చేత కంటతడి పెట్టించిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Virat Kohli : భార్య అనుష్క శర్మ చేత కంటతడి పెట్టించిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Virat Kohli : భార్య అనుష్క శర్మ చేత కంటతడి పెట్టించిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Virat Kohli : భార్య అనుష్క శర్మ చేత కంటతడి పెట్టించిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Virat Kohli : అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    విరుష్క జంట ఏది చేసినా స్పెషల్ గా ఉంటుంది. విరుష్క జోడి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ గా సాగిపోతోంది. ఈ దంపతులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ఆటతో కోహ్లీ (Virat Kohli).. సినిమాలతో అనుష్క (Anushka Sharma) ఫుల్ బిజీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తమకు సంబందించిన ప్రతి విషయాన్ని విరుష్క జోడి అభిమానులతో పంచుకుంటారు. తాజాగా, వీరిద్దరి మధ్య జరిగిన భావోద్వేగమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరు వామికాగా వెల్లడించారు.

    ఇక, లేటెస్ట్ గా తన 33 వ బర్త్ డే జరుపుకున్నారు అనుష్క శర్మ. అనుష్క శర్మ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో విరాట్ కోహ్లీ ఏకంగా భార్య కోసం పాట పాడేశాడు. ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ యొక్క "మేరే మహబూబ్ ఖయామత్ హోగీ" గేయాన్ని పాడాడు కోహ్లీ. ృవిరాట్ కోహ్లీ పాడుతున్నంత సేపు అనుష్క శర్మ ఎమోషనల్ అయ్యారు. విరాట్ పాట ముగించగానే అతిథులందరూ చప్పట్ల మోత మోగించారు. ఆ సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన అనుష్క కంటతడి పెట్టుకొన్నారు.

    ఇక, ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో బిజీగా గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ. తన టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముందుండి నడిపిస్తున్నాడు. అనుష్క శర్మతో కూడా విరాట్ తో పాటే.. మ్యాచ్ లకు హాజరవుతుంది. ఇక, అనుష్క సినీ కెరీర్ విషయానికి వస్తే.. హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తున్నారు. లాక్ డౌన్‌కు ముందు జీరో, అంగ్రేజీ మీడియం సినిమాల్లో నటించారు. లాక్‌డౌన్‌ సమయంలో పాతాళ్ లోక్, బుల్‌బుల్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్ కొడుకు..బబిల్ ఖాన్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Anushka Sharma, IPL 2021, Royal Challengers Bangalore, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు