MS Dhoni : ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు?... విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే...

ICC World Cup 2019 : న్యూజిలాండ్‌తో టీమిండియా సెమీఫైనల్‌లో ధోనీ రనౌట్ కావడంతో... మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఈ వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైరవుతాడని ప్రచారం జరిగింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 6:14 AM IST
MS Dhoni : ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు?... విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే...
ఎంఎస్ ధోనీ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 6:14 AM IST
మాంచెస్టర్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడి ఓడిపోయి... వరల్డ్ కప్ నుంచీ తొలగిన టీమిండియాలో... మిస్టర్ డిపెండబుల్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తాజాగా స్పందించాడు. మాంచెస్టర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కోహ్లీ... ధోనీ రిటైర్మెంట్‌పై తన దగ్గర ఏ సమాచారమూ లేదన్నాడు. ధోనీ ఫ్యూచరేంటన్నది ధోనీ తనకేమీ చెప్పలేదని అన్నాడు. నిజానికి ఈ ప్రపంచ కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. ఐతే... కప్ కచ్చితంగా గెలుస్తారనీ, ఆ ఆనందంలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత... ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, లేదా అన్నది సస్పెన్స్ అయ్యింది.


నిజానికి ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా చివరి మ్యాచ్‌లో ధోనీ... 50 రన్స్ చేసి సేఫ్ మోడ్‌లో ఉన్నాడు. మ్యాచ్ చివర్లో ఔట్ అవ్వకుండా ఉండి ఉంటే... మరింత పోరాడేవాడే. కానీ కలిసిరాలేదు. రవీద్ర జడేజాకు తోడుగా క్రీజ్‌లో చాలా సేపు నిలిచినా... వాళ్లిద్దరూ కలిసి ఏడో వికెట్ పడే నాటికి 106 రన్స్ యాడ్ చేసినా... టీం ఇండియా... 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రధానంగా మొదటి పది ఓవర్లలో టాప్ ఆర్డర్ ఏమాత్రం రన్స్ తీయకపోవడమే కాక... వరుసపెట్టి కుప్పకూలడం టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లింది.

ఈ ప్రపంచకప్‌లో ధోనీ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించినా... ఓవరాల్‌గా స్ట్రైక్ రేట్ తగ్గింది. ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్‌తో గెలుపు విషయంలో ఇండియా పోరాడాల్సి రావడంతో... ధోనీ రిటైర్మెంట్‌పై ఒత్తిడి పెరిగింది. ఐతే... సెమీ ఫైనల్‌లో ధోనీ ఆటతీరు చూసిన మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మాత్రం జార్ఖండ్ డైనమైట్‌కే మద్దతిచ్చాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇప్పటికీ గ్రేట్ ఫినిషర్ అని మెచ్చుకున్నాడు. మరి ధోనీ కొనసాగుతాడా, గుడ్ బై చెబుతాడా అన్నది తేలాలంటే మరికొన్నాళ్లు పట్టేలా ఉంది.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...