హోమ్ /వార్తలు /క్రీడలు /

ఆ ఫోటోతో Virat Kohli కి ఘోర అవమానం..న్యూజిలాండ్ ప్రముఖ వెబ్ సైట్ పై ఫ్యాన్స్ గుస్సా..

ఆ ఫోటోతో Virat Kohli కి ఘోర అవమానం..న్యూజిలాండ్ ప్రముఖ వెబ్ సైట్ పై ఫ్యాన్స్ గుస్సా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Virat Kohli : మెగా ఫైనల్లో భారత జట్టు చేజాతులారా ఓటమిపాలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం ఉండొచ్చు. కానీ, న్యూజిలాండ్ ప్రముఖ వెబ్ సైట్.. విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించింది.

ఇంకా చదవండి ...

  ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final) తలపడిన భారత్ కు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... అద్భుత ఆటతీరుతో మెగా టోర్నీని సొంతం చేసుకుంది విలియమ్సన్ సేన. అయితే, ఈ మెగా ఫైనల్లో భారత జట్టు చేజాతులారా ఓటమిపాలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం ఉండొచ్చు. కానీ, న్యూజిలాండ్ ప్రముఖ వెబ్ సైట్.. విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించింది. ప్రముఖ వెబ్ సైట్ TheAccNZ పెట్టిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటో విరాట్ కోహ్లీని అవమానించేలా ఉంది. ఆ ఫోటోలో ఒక మహిళ.. బెల్ట్ తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్ గా పోలస్తూ.. ఆ మనిషిని విరాట్ కోహ్లీతో పోల్చింది TheAccNZ. ఈ పోస్ట్ ని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

  WTC Final మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రెండుసార్లు.. జేమీసన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. దీంతో ఆ అర్ధం వచ్చేలా.. ఆ వెబ్ సైట్ ఇలాంటి పోస్ట్ చేసింది. అయితే, ఈ పోస్ట్ పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్ ని ఇలా అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు. ఈ ఫోటో భారత్ లో వైరల్ అయితే.. ఆ వెబ్ సైట్ నామారూపాలు ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు.

  View this post on Instagram


  A post shared by The ACC (@theaccnz)  మరి కొందరు అయితే.. న్యూజిలాండ్ గ్రౌండ్ లోపల..బయటా చాలా మర్యాదగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ చర్యతో వాళ్ల ప్రతిష్టను దిగజార్చుకున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్ అయితే.. కైల్ జెమీసన్ ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు. మరోవైపు, టీమ్ ఇండియాకు (Team India) ఐసీసీ ఈవెంట్ల (ICC Events) శాపం పట్టుకున్నట్లు ఉన్నది. గత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో ఏడు సార్లు ఫైనల్స్‌కు చేరుకొని మరి ఓటమిని కొని తెచ్చుకుంది. ప్లేఆఫ్స్, నాకౌట్ దశకు సులభంగానే చేరుకుంటున్న టీమ్ ఇండయాకు చివరి మొట్టుపై బోల్త పడటం పరిపాటిగా మారిపోయింది. అయితే ఎంఎస్ ధోనీ (MS dhoni) ఉన్నప్పుడు ఇలాంటి భయాలు ఏమీ లేవు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి టీమ్ ఇండియా ఫైనల్ ఫోబియా పట్టుకున్నది. అందుకే కోహ్లీకి కెప్టెన్‌గా ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేకుండా పోయింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs newzealand, Rohit sharma, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు