TEAM INDIA CAPTAIN VIRAT KOHLI AND ANUSHKA SHARMA STARTED A FUNDRAISER CAMPAIGN TO FIGHT AGAINST COVID 19 SRD
Virat Kohli - Anushka Sharma : కరోనా బాధితుల కోసం విరుష్క జోడి భారీ సాయం..అంతే కాకుండా..
Virat Kohli - Anushka Sharma : కరోనా బాధితుల కోసం విరుష్క జోడి భారీ సాయం..అంతే కాకుండా..
Virat Kohli - Anushka Sharma : దేశంలో ఎక్కడా విన్నా కరోనా ఆర్తనాదాలే. సాయం కోసం ఎంతో మంది అభాగ్యులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ ఎంతో మంది సాయం చేస్తున్నారు.
భారతదేశంలో కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆక్సిజన్, బెడ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు టీమిండియా విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు అతని సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma). ఈ జోడి మరో సారి తమ గొప్ప మనస్సు చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్‌కు పిలుపునిచ్చారు. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కోహ్లీ, అనుష్క శర్మ తమ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. " దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోంది. జనాలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. మన కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న మెడికల్, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఏం చెప్పినా సరిపోదు. వారికి ఇప్పుడు మన మద్దుత అవసరం. అందుకే అనుష్క శర్మ, నేను.. కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపైన్ మొదలుపెడుతున్నాం. ప్రతీ రూపాయి ఎంతో ఉపయోగడపడుతుంది. మనం కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి నడుద్దాం. కరోనాను జయిద్దాం" అని ఆ వీడియో ద్వారా విరుష్క జోడీ పిలుపునిచ్చారు.
అయితే ఈ పోస్ట్‌లో ఎక్కడా తాము ఎంత విరాళం ఇచ్చామనే విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ కెట్టో సంస్థ టాప్ డోనర్స్ జాబితాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా పేర్కొంది. గతేడాది కూడా ఈ జోడీ పీఎం కేర్స్‌కు భారీ విరాళాన్ని అందజేసింది. అప్పుడు కూడా ఎంత చేశామనే విషయంలో గోప్యత పాటించింది. కానీ వారి సన్నిహితుల సమాచారం ప్రకారం విరాట్, అనుష్క రూ.3 కోట్లు విరాళాన్ని అందించినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయ్. మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది.
క్యాష్ రీచ్ లీగ్ వాయిదా పడటంతో ముంబైకి వచ్చిన విరాట్.. కరోనా బాధితుల సాయార్దం ఈ ఫండ్ రైజింగ్ క్యాంపయిన్‌ను మొదలుపెట్టాడు. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఈ నెల ఆఖర్లో ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. ఈ టూర్ కోసం బీసీసీఐ జంబో టీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.