Home /News /sports /

TEAM INDIA CAPTAIN SUNIL CHHETRI SURPASSED LIONEL MESSI GOALS RECORD NOW CHHETRI IS BEHIND CRISTIANO RONALDO

Football : మెస్సీని దాటిపోయిన సునిల్ ఛత్రి.. టీమ్ ఇండియా కెప్టెన్ సంచలన రికార్డు.. రొనాల్డో తర్వాత స్థానంలో చత్రి

టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ చత్రి అంతర్జాతీయ గోల్స్ రికార్డు

టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ చత్రి అంతర్జాతీయ గోల్స్ రికార్డు

ఇండియా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ చత్రి అంతర్జాతీయ గోల్స్‌లో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక గోల్స్ చేసి ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న లిస్టులో క్రిస్టియానో రొనాల్డో తర్వాత స్థానానికి చత్రి చేరుకున్నాడు. అర్జంటీనా స్టార్ లియోనల్ మెస్సీని కూడా అతడు దాటి పోయాడు.

ఇంకా చదవండి ...
    ఫుట్‌బాల్ (Football) అనగానే మనకు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo), లియోనల్ మెస్సీ (Lionel Messi) వంటి వాళ్లే గుర్తుకు వస్తారు. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్స్‌లో అత్యధికంగా సంపాదించేది వాళ్లే. అంతే కాకుండా ఆయా క్లబ్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరిద్దరూ ఆ క్లబ్స్‌కు కెప్టెన్స్. అదే సమయంలో పోర్చుగల్ కెప్టెన్‌గా రొనాల్డో, అర్జంటీనా కెప్టెన్‌గా మెస్సీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా దూసుకొని పోతున్నారు. అయితే ఇండియాలో భైచింగ్ భూటియా తర్వాత అంతకు మించిన పేరు తెచ్చుకున్న ఫుట్‌బాలర్ సునిల్ ఛత్రి (Sunil Chhetri) మాత్రమే. టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ ఛత్రి సోమవారం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దోహాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో టీమ్ ఇండియాను లీడ్ చేస్తున్నాడు. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. ఈ రెండు గోల్స్ కూడా చత్రినే చేయడం గమనార్హం. సునిల్ చత్రి స్కోర్ చేయడంతో ఆరేళ్ల తర్వాత టీమ్ ఇండియా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో విజయం సాధించింది. ఈ రెండు గోల్స్‌తో కలిపి చత్రి అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 74కు చేరింది. ప్రస్తుతం సునిల్ చత్రి అంతర్జాతీయ గోల్స్‌లో లియోనల్ మెస్సీ (72)ని అధిగమించాడు. మెస్సీ తర్వాత యూఏఈకి చెందిన అలీ మబ్కౌత్ (73) ఉన్నాడు. సునిల్ చత్రి కేవలం 117 మ్యాచ్‌లలోనే 74 గోల్స్ చేయగా.. మెస్సీ 143 మ్యాచ్‌లలో 72 గోల్స్ చేశాడు.

    అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆల్ టైం అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇరాన్‌కు చెందిన అలీ దాయ్ పేరిట ఉన్నది. 149 మ్యాచ్‌లో 109 గోల్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే 2006క జూన్ 21న అలీ ఆటకు గుడ్‌బై చెప్పాడు. రెండో స్థానంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. 174 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 103 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అంతర్జాతీయ గోల్స్ సెంచరీలు చేసింది వీరిద్దరే. 10వ స్థానంలో చత్రి, 11వ స్థానంలో అలి ముబ్కౌత్, 12వ స్థానంలో లియోనల్ మెస్సీ, మజీద్ అబ్దుల్లా ఉన్నారు. అయితే టాప్ 12లో ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం ఇంకా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడుతున్నది నలుగురే. కేవలం క్రిస్టియానో రొనాల్డో, సునిల్ చత్రి, అలీ మబ్కౌత్, లియోనల్ మెస్సీ మాత్రమే ఫుట్‌బాల్ ఆడుతున్నారు. అంటే క్రిస్టియానో రొనాల్డో తర్వాతి స్థానంలో సునిల్ చత్రి ఉన్నాడు. వీరందరి కెరీర్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నది. క్రిస్టియానో రొనాల్డో రికార్డును వీరి అందుకోవడం కష్టమే అని చెప్పాలి. ఇండియా నుంచి టాప్ 10 లిస్టులో సునిల్ చత్రి మాత్రమే ఉన్నాడు. అతడు ఆల్‌టైమ్







    అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్

    1. అలీ దాయ్ (ఇరాన్) - 109 (149 మ్యాచ్‌లు)
    2. క్రిస్టియానో రోనాల్డో (పోర్చుగల్) - 103 (174 మ్యాచ్‌లు)
    3. మొక్తార్ దహరి (మలేషియా) - 89 (మ్యాచ్‌లు)
    4. ఫెరెక్ పుస్కాస్ (హంగేరి) - 84 (85 మ్యాచ్‌లు)
    5. గాడ్ఫ్రే చితాలు (జాంబియా) - 79 (111 మ్యాచ్‌లు)
    6. హుస్సేన్ సయీద్ (ఇరాక్) - 78 (137 మ్యాచ్‌లు)
    7. పీలే (బ్రెజిల్) - 77 (92 మ్యాచ్‌లు)
    8. కునిషిగే కమమోటో (జపాన్) - 75 (76 మ్యాచ్‌లు)
    9. బషర్ అబ్దుల్లా (కువైట్) - 75 (134 మ్యాచ్‌లు)
    10. సునిల్ చత్రి (ఇండియా) - 74 (117 మ్యాచ్‌లు)
    11. అలి మబ్కౌత్ (యూఏఈ) - 73 (90 మ్యాచ్‌లు)
    12. లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) - 72 (143 మ్యాచ్‌లు)
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Christiano Ronaldo, FIFA, Football, Messi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు