Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: August 2, 2018, 10:47 PM IST
విరాట్ కోహ్లీ సెంచరీ అభివాదం
ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం, ఎక్కువ సేపు నిలవలేదు. భారత మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్మెన్లందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ 149 పరుగులు చేసి, చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఓపెనర్లు విజయ్, శిఖర్ ధావన్ నిలకడగా ఆడడంతో ఒక దశలో భారత ఇన్నింగ్స్ వికెట్లేమీ కోల్పోకుండా 50 పరుగులు నమోదు చేసింది. అయితే శామ్ కుర్రాన్ బౌలింగ్‌కి వచ్చిన తర్వాతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓపెనర్ మురళీ విజయ్ను 20 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన శామ్ కుర్రాన్, మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కూడా అవుట్ చేశాడు. శిఖర్ ధావన్ 26 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగుకి వచ్చిన రాహుల్ మొదటి బంతికి ఫోర్ కొట్టి, రెండో బంతికి అవుటయ్యాడు. రాహుల్ వికెట్ కూడా శామ్ కుర్రాన్ ఖాతాలోనే చేరడం విశేషం.
ఓ వైపు విరాట్ కోహ్లీ నిదానంగా కుదురుకుని బ్యాటింగ్ చేస్తున్న అతనికి సపోర్ట్ ఇచ్చేవారే కరువయ్యారు. అజింకా రహానే 15 పరుగులు చేయగా, దినేష్ కార్తీక్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 22 పరుగులు, అశ్విన్ 10 పరుగులు, షమీ 2 పరుగులు, ఇషాంత్ 5 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్ 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మాత్రం చూడచక్కని షాట్లతో టెస్టు కెరీర్లో 22వ శతకాన్ని నమోదు చేశాడు. 225 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, 22 ఫోర్లు, ఒక్క సిక్సర్‌తో 149 పరుగులు చేశాడు. 113 ఇన్నింగ్స్‌లో 22 టెస్టు సెంచరీలు చేసిన విరాట్, అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అన్ని సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసింది. దాంతో వారికి 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
Published by:
Ramu Chinthakindhi
First published:
August 2, 2018, 10:47 PM IST