హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : కోహ్లీ నువ్వు కేక.. ఆ క్రేజ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకే ఝలక్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్..!

Virat Kohli : కోహ్లీ నువ్వు కేక.. ఆ క్రేజ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకే ఝలక్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్..!

kohli-pm modi ( ఫైల్ ఫోటో)

kohli-pm modi ( ఫైల్ ఫోటో)

Virat Kohli : కోహ్లీ.. భారత్ లో ఈ పేరుకున్నా క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజే ఇప్పుడు ఏకంగా కోహ్లీ ని టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. ఎంతలా అంటే ఏకంగా ఆ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీనే వెనక్కి నెట్టాడు కింగ్ కోహ్లీ. ఇంతకీ ఏ విషయంలో మోడీ కన్నా కోహ్లీ ముందున్నాడో తెలుసా..!

ఇంకా చదవండి ...

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభావశీల వ్యక్తుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ కన్నా ముందు వరుసలో నిలిచాడు. హైప్‌ ఆడిటర్స్‌ రూపొందించిన ప్రపంచ వ్యాప్త వెయ్యి మంది ఇన్‌స్టా ప్రభావశీలుర లిస్ట్ లో పోర్చుగీసు ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలవగా.. అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ మెస్సీ 4వ స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ 12వ, ప్రధాని మోడీ 20వ స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ నెమార్‌కు 13వ ర్యాంక్‌ దక్కింది.

ఇక విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ భారత్ నుంచి మూడో వ్యక్తిగా ఈ జాబితాలో చోటు దక్కించుకొని 26వ స్థానంలో నిలిచింది. సహచర నటి దీపికా పడుకునే 49వ స్థానంలో ఉండగా.. ఆమె కన్నా అనుష్క 23 స్థానాల్లో ముందు ఉంది.

ఈ ఏడాది ట్విటర్‌లో అత్యధికంగా ప్రస్తావించిన భారత అథ్లెట్‌గా విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల జాబితాలో ధోనీ, రోహిత్‌ శర్మను వెనక్కు నెట్టి విరాట్‌ ప్రథమ స్థానాన్ని అలంకరించాడు. కాగా, ట్విటర్‌లో ఎక్కువగా ట్వీట్‌ చేసిన మహిళల్లో బ్యాడ్మింటన్‌ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ లిస్ట్ లో రెజ్లర్‌ గీతా ఫొగట్‌ అగ్రస్థానం దక్కించుకొంది. తన రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రధాని మోదీ రాసిన లేఖకు ధన్యవాదాలు చెబుతూ ధోనీ చేసిన ట్వీట్‌.. అత్యధికంగా రీట్వీట్‌ చేసిన ఓ అథ్లెట్‌ ట్వీట్‌గా నిలిచింది. క్రీడల విభాగంలో ఎక్కువ మంది ఇష్టపడి, కోట్‌ చేసిన ట్వీట్‌ అనుష్క ప్రెగ్నెన్సీ వార్త కావడం విశేషం.

Published by:Sridhar Reddy
First published:

Tags: Instagram, Kohli, Narendra modi, PM Narendra Modi, Virat kohli

ఉత్తమ కథలు