TEAM INDIA CANCELS CRUCIAL PRACTICE SESSION CHECK WHY PRACTICE SESSION CANCELLED JNK
Team India: కీలక మ్యాచ్ ముందు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టిన టీమ్ ఇండియా... కారణం ఇదే? నేడు తేలనున్న పాండ్యా భవిష్యత్
ప్రాక్టీస్ సెషన్ డుమ్మా కొట్టి.. బీచ్ వాలీబాల్ ఆడుతున్న టీమ్ ఇండియా క్రికెటర్లు (PC: Twitter)
Team india: న్యూజీలాండ్‌తో కీలక మ్యాచ్ ముందు టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నది. దుబాయ్ ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో జరగాల్సిన సాధనను పక్కన పెట్టి.. బీచ్‌లో వాలీబాల్ ఆడుతూ టీమ్ ఇండియా క్రికెటర్లు కనిపించారు.
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సెమీఫైనల్ రేసులో ఉండాలంటే ఆదివారం న్యూజీలాండ్‌తో (New Zealand) జరగాల్సిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా (Team India) తప్పక గెలవాల్సి ఉన్నది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం భారత జట్టుకు వారం రోజుల విరామం దొరికింది. దీంతో దుబాయ్ లోని ఐసీసీ (ICC) అకాడమీ గ్రౌండ్లో నాలుగు రోజులుగా సాధన చేసింది. కెప్టెన్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనపడ్డారు. వారితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా దగ్గరుండి భారత పేసర్లకు సూచనలు ఇవ్వడం కనిపించింది. అయితే శుక్రవారం రోజు మాత్రం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మానేసింది. మ్యాచ్‌కు 48 గంటల ముందు కీలకమైన ప్రాక్టీస్ సెషన్ దూరం చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. కాగా, దీనిపై టీమ్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. టీమ్ ఇండియా ప్రస్తుతం దుబాయ్‌లోని 'ది పామ్' లగ్జరీ హోటల్లో బస చేస్తున్నది. గత నాలుగు రోజులుగా దుబాయ్‌లోనే ప్రాక్టీస్ కూడా చేస్తున్నది. కానీ శుక్రవారం ప్రాక్టీస్ కోసం అబుదాబి స్టేడియంను వినియోగించుకోవాలని సూచించారు.
దుబాయ్ నుంచి అబుదాబికి రెండు గంటల ప్రయాణం. రాను పోను టీమ్‌కు 4 గంటలు ప్రయాణంలోనే సరిపోతుంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమకు దుబాయ్ కాకుండా అబుదాబిలో ప్రాక్టీస్ కేటాయించారని ఐసీసీకి పిర్యాదు చేసింది. కాగా, టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్య ఇస్తున్న బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులకు పిర్యాదు చేయాలని ఐసీసీ పేర్కొన్నది. ఆపరేషనల్‌కు సంబంధించిన ఏ సమస్యను అయినా ఆతిథ్య క్రికెట్ బోర్డులకే పిర్యాదు చేయాలని చెప్పడంతో టీమ్ ఇండియా మిన్నకుండిపోయింది. ప్రాక్టీస్ సెషన్ క్యాన్సిల్ కావడంతో కొంత మంది దుబాయ్‌లోనే బీచ్ వాలిబాల్ ఆడుతూ కనిపించారు. మరి కొంత మంది హోటల్ రూమ్‌లలో గడిపారు.
మరోవైపు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాను శుక్రవారం నెట్స్‌లో రెండో సారి పరిశీలించాల్సి ఉన్నది. కానీ ప్రాక్టీస్ సెషన్ రద్దుతో అతడిని శనివారం పరీక్షించనున్నట్లు తెలుస్తున్నది. గత కొంత కాలంగా వెన్నునొప్పి కారణంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో స్థానం సంపాదించి ఇలా బ్యాటర్‌గా కొనసాగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం బ్యాటింగ్‌కు పరిమితం కావడంతో భారత్‌కు ఆరో బౌలర్ ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో న్యూజీలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా బదులు శార్దుల్ ఠాకూర్‌ను తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి. ఒక వేళ బ్యాటర్ మాత్రమే అవసరం అయితే ఇషాన్ కిషన్‌ను అయినా తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని కూడా సీనియర్ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరి కోహ్లీ, టీమ్ మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.