Home /News /sports /

T20 World Cup: " ఇండియా మామూలుగా ఆడినా చాలు.. పాకిస్తాన్ ఫసక్కే " .. సొంత జట్టుకు క్రికెటర్ వార్నింగ్..

T20 World Cup: " ఇండియా మామూలుగా ఆడినా చాలు.. పాకిస్తాన్ ఫసక్కే " .. సొంత జట్టుకు క్రికెటర్ వార్నింగ్..

India Vs Pakistan

India Vs Pakistan

T20 World Cup: హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మెగా పోరుపై మాజీ క్రికెటర్లు కూడా తెగ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పాక్ క్రికెటర్లు.. ఈ మెగా పోరుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

    ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest News) చివరి అంకానికి చేరుకుంది. ఇక, ఐపీఎల్ తర్వాత అలరించడానికి టీ-20 ప్రపంచకప్ టోర్నీ (T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మెగా పోరుపై మాజీ క్రికెటర్లు కూడా తెగ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పాక్ క్రికెటర్లు.. ఈ మెగా పోరుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

    మొన్న.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ టీమిండియాపై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. 'ఇండియా ఈ టైంలో పాకిస్తాన్‌తో తలపడలేదు. పాకిస్తాన్ జట్టులో ఉన్న టాలెంట్ చాలా డిఫరెంట్. ఇలాంటి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఇండియా టీమ్‌లో అసలు లేరు. ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరిగి ఉంటే బాగుండేది. అప్పుడు టీమ్ ఇండియా అలవాటు పడేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌తో ఆడటం చాలా కష్టం' అని అబ్దుల్ రజాక్ అన్నాడు. గత కొన్నేళ్లుగా ఇండియా తయారు చేసిన క్రికెటర్ల కంటే ఎక్కువ నాణ్యత కలిగిన క్రికెటర్లు పాకిస్తాన్‌లోనే ఉన్నారని నోరు పారేసుకున్నాడు.

    రజాక్ వ్యాఖ్యలకు ఆ దేశ మాజీ క్రికెటర్ దినేశ్ కనేరియా కౌంటరిచ్చాడు. గ్రౌండ్ లోకి దిగితే టీమిండియా సత్తా ఎంటో తెలుస్తోందని కోహ్లీసేనకు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు టీమిండియాను పొగిడిన క్రికెటర్ల లిస్ట్ లో ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకీబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టీమ్ ను ఓడించడానికి టీమిండియా కష్టపడనక్కర్లేదని.. మాములుగా ఆడినా చాలు బాబర్ ఆజమ్ టీమ్ ఓడిపోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆకీబ్ జావేద్


    " టీమిండియా బెస్ట్ ప్రదర్శన చూపాల్సిన పనిలేదు. మ్యాచ్ రోజు నార్మల్ గా ఆడినా టీమిండియానే పై చేయి సాధిస్తోంది. అదే పాక్ అయితే మాత్రం ఎప్పటికన్నా ఆ రోజు కష్టపడాల్సిందే. 100 శాతం కన్నా ఎక్కువ కష్టపడితినే టీమిండియాను ఓడించగలుగుతోంది. టీమిండియాలో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్నాడు. టీమ్ బలబలాలు పరిశీలిస్తే.. పాకిస్థాన్ కన్నా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువ" అంటూ య్యూటూబ్ ఛానెల్ లో ఆకీబ్ జావేద్ వెల్లడించాడు.

    ఆకీబ్ జావెద్ 1990 ల్లో పాకిస్థాన్ జట్టులో కీలక బౌలర్. అలాగే, టీమిండియా మీద హ్యాట్రిక్ సాధించిన బౌలర్. ఇక, వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకు పాకిస్ధాన్ మీద అజేయ రికార్డు ఉంది. 12-0 తేడాతో భారత్ పాకిస్థాన్ కు అందనంత ఎత్తులో ఉంది. ఇక, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Babar Azam, Cricket, India VS Pakistan, Jasprit Bumrah, T20 World Cup 2021, Virat kohli

    తదుపరి వార్తలు