Home /News /sports /

TEAM INDIA BOWLER DEEPAK CHAHAR SISTER MALTI BOLD TWEET ON HER BROTHER HONEYMOON AND NETIZENS TROLLED BRUTALLY SRD

Malti Chahar : 'ఛీ .. నువ్వు అసలు అక్కావేనా.. హానీమూన్ గురించి తమ్ముడికి ఇలాంటి సలహానా '

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Malti Chahar : దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్ (Malti Chahar).. తన తమ్ముడిని ఉద్దేశిస్తూ ఓ బోల్డ్ ట్వీట్ చేసింది. ఆ ట్వీటే ఇప్పుడు ఆమె కొంపముంచింది.

  టీమిండియా (Team India) స్టార్ బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న తన ప్రేయసి జయా భరద్వాజ్ తో జూన్ 1న అతడి వివాహం ఆగ్రాలో ఘనంగా జరిగింది. గతేడాది దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ రోజు 29 ఏళ్ల దీపక్‌.. స్టేడియం సాక్షిగా జయకు తన ప్రేమను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్ (Malti Chahar).. తన తమ్ముడిని ఉద్దేశిస్తూ ఓ బోల్డ్ ట్వీట్ చేసింది. ఆ ట్వీటే ఇప్పుడు ఆమె కొంపముంచింది. ఆమె చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏంటి..? దానిపై ఎందుకు ఇంత రచ్చ జరగుతోంది..?

  వివరాల్లోకెళితే.. కొత్త జంటతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె..'ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు. దీపక్ హనీమూన్‌లో నీ నడుము జాగ్రత్త. అసలే మనకు ప్రపంచకప్ ఉంది'అంటూ కొంటెగా ట్వీట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు ఓ వర్గం నెటిజన్లకు నచ్చలేదు. ఓ అక్క.. తమ్ముడి హానీమూన్ గురించి ఇలా బాహటంగా మాట్లాడటం సరికాదని వారు మండిపడుతున్నారు. 'ఛీ .. నువ్వు అసలు అక్కావేనా.. హానీమూన్ గురించి తమ్ముడికి ఇలాంటి సలహానా ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
  అయినా, దీపక్‌ చాహర్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్‌ అయిపోయారా? అతని సేవలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు.. భువనేశ్వర్ ఉన్నాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు. సరదాగా ఆమె చేసిన ట్వీట్‌ను ఇంతలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.
  ఇక.. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో 14 కోట్లకు సీఎస్‌కే దీపక్‌ చహర్‌ను కొనుగోలు చేయగా గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి అతడు దూరమయ్యాడు. గాయం ఎఫెక్ట్ తో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికకాలేదు. ఇక, మాలతి చాహర్ త్వరలోనే బాలీవుడ్ లోకి కాలుమోపనుంది. ఆమె నటించబోతున్న తొలి సినిమా చిత్రీకరణ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం.

  ఇది కూడా చదవండి : సచిన్ కొడుకైతే సరిపోదు.. విషయం ఉంటేనే టీంలోకి.. అర్జున్ ఎంట్రీపై ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ కామెంట్స్

  ‘ఇష్క్ పష్మినా’ అనే చిత్రంతో మాలతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫీల్ గెడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో భావిన్ భానుషాలి హీరోగా నటిస్తున్నాడు. భావిన్.. ‘దె దె ప్యార్ దే’, ‘వెల్లపంటి’, ‘ఏ.ఐ.షా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్’ ద్వారా అటు బుల్లితెర ఇటు వెండితెర అభిమానులకు సుపరిచితుడే. కానీ హీరోగా అతడికి ఇదే తొలి చిత్రం.అరవింద్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. లవ్ స్టోరీ ప్రధానంశంగా రూపొందించనున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, T20 World Cup 2022, Team India

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు