హోమ్ /వార్తలు /క్రీడలు /

INDvENG: మూడో టెస్టులో తొలి రోజు ఇంగ్లాండ్ డామినేషన్.. చేతులెత్తేసిన భారత్.. బౌలర్ల పైనే భారం

INDvENG: మూడో టెస్టులో తొలి రోజు ఇంగ్లాండ్ డామినేషన్.. చేతులెత్తేసిన భారత్.. బౌలర్ల పైనే భారం

ఇండియాను ఒక ఆటాడుకున్న ఇంగ్లాండ్.. తొలి రోజు వారిదే ఆధిపత్యం (PC: England Cricket/Twitter)

ఇండియాను ఒక ఆటాడుకున్న ఇంగ్లాండ్.. తొలి రోజు వారిదే ఆధిపత్యం (PC: England Cricket/Twitter)

లీడ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తొలి రోజు చేతులెత్తేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆధిపత్యం సాధించింది. ఈ టెస్టును భారత జట్టు కనీసం డ్రా చేసుకోవడానికైనా చాలా కష్టపడాల్సి ఉన్నది.

ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) భారత జట్టు (Team India) తొలి సారిగా అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. లార్డ్స్ మైదానంలో (The Lord's) జరిగిన 2వ టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు.. 3వ టెస్టుకు వచ్చే సరికి పూర్తిగా చతికిల పడింది. రెండో టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహమో.. గెలుపుపై పెరిగిన ధీమానో గానీ.. ఇంగ్లాండ్ బౌలర్లను తక్కువ అంచనా వేసి లీడ్స్‌లో అభాసుపాలయ్యారు. తొలి రోజు కేవలం 40.4 ఓవర్లు మాత్రమే ఆడి 78 పరుగులకు ఆలౌట్ అయ్యారు. గత కొన్ని మ్యాచ్‌లుగా టాస్ ఓడుతూ వస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ లీడ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై పచ్చిక తక్కువగా ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావించిన కెప్టెన్ నిర్ణయం ఎంత తప్పో తొలి ఓవర్‌లోనే తెలిసిపోయింది. భారత జట్టు తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా పుజార (1), కోహ్లీ (7) కూడా పెవీలియన్ బాట పట్టారు. టాప్ 3 బ్యాట్స్‌మెన్‌లను అండర్సన్ అవుట్ చేయడం గమనార్హం. తొలి సెషన్‌లో 54 పరుగులు చేసిన భారత జట్టు రెండో సెషన్‌లో 22 పరుగులకు మిగిలిన 6 వికెట్లు కోల్పోయి 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్‌లో భారత జట్టుకు ఇదే మూడో అత్యల్ప టెస్ట్ స్కోర్ కాగా.. మొత్తానికి 9వ అత్యల్ప స్కోర్‌గా నిలిచింది.

ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడింది. రెండోటెస్టు ఓటమి కసి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను అత్యల్ప స్కోర్‌కు అవుట్ చేసిన ఉత్సాహంతో అసలు ఏ మాత్రం తప్పులు చేయకుండా ఓపెనర్లు ధాటిగా ఆడారు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన ఓపెన్ హసీబ్ హమీద్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. రోరీ బర్న్స్ కూడా గత మ్యాచ్ వైఫల్యం నుంచి కోలుకున్నాడు. వీరిద్దరూ భారత బౌలర్లుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52 బ్యాటింగ్), హసీబ్ హమీద్ (60 బ్యాటింగ్) ఇద్దరూ కలసి తొలి వికెట్‌కు అజేయంగా 120 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ జట్టు 42 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యత సాధించింది.

ఇండియా తొలి ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (సి) ఓలీ రాబిన్‌సన్ (బి) క్రెయిగ్ ఓవర్టన్ 19, కేఎల్ రాహుల్ (సి) జాస్ బటర్ల్ (బి) జేమ్స్ అండర్సన్ 0, చతేశ్వర్ పుజార (సి) జాస్ బట్లర్ (బి) జేమ్స్ అండర్సన్ 1, విరాట్ కోహ్లీ (సి)) జాస్ బట్లర్ (బి) జేమ్స్ అండర్సన్ 7, అజింక్య రహానే (సి) జేమ్స్ అండర్సన్ (బి) ఓలీ రాబిన్ సన్ 18, రిషబ్ పంత్ (సి) జాస్ బట్లర్ (బి) ఓలీ రాబిన్ సన్ 2, రవీంద్ర జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) సామ్ కర్రన్ 4, మహ్మద్ షమి (సి) రోరీ బర్న్స్ (బి) క్రెయిగ్ ఓవర్టన్ 0, ఇషాంత్ శర్మ 8 నాటౌట్, జస్ప్రిత్ బుమ్రా (ఎల్బీడబ్ల్యూ) (బి) సామ్ కర్రన్ 0, మహ్మద్ సిరాజ్ (సి) జో రూట్ (బి) క్రెయిగ్ ఓవర్టన్ 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (40.4 ఓవర్లు) 78/10

వికెట్ల పతనం : 1-1, 2-4, 3-21, 4-56, 5- 58, 6-67, 7-67, 8-67, 9-67, 10-78

బౌలింగ్: జేమ్స్ అండర్సన్ (8-5-6-3), ఓలీ రాబిన్‌సన్ (10-3-16-2), సామ్ కర్రన్ (10-2-27-2), మొయిన్ అలీ(2-0-4-0), క్రెయిగ్ ఓవర్టన్ (10.4-5-14-3)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్

రోరీ బర్న్స్ 52 బ్యాటింగ్, హసీబ్ హమీద్ 60 బ్యాటింగ్

బౌలింగ్ : ఇషాంత్ శర్మ (7-0-26-0), జస్ప్రిత్ బుమ్రా (12-5-19-0), మహ్మద్ షమీ (11-2-39-0), మహ్మద్ సిరాజ్ (7-1-26-0), రవీంద్ర జడేజా (5-3-6-0)

First published:

Tags: India vs england, Team India, Test Cricket