గ్రౌండ్‌లో గబ్బర్ డ్యాన్స్...ధావన్ ధనాధన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా

ఈ సిరీస్‌లో శిఖర్ ధావన్ 47 సగటుతో 188 పరుగులు చేశాడు. నాలుగు, ఐదో వన్డేల్లో విఫలమయినప్పటికీ భారత్ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గబ్బర్.

news18-telugu
Updated: February 4, 2019, 8:50 PM IST
గ్రౌండ్‌లో గబ్బర్ డ్యాన్స్...ధావన్ ధనాధన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
శిఖర్ ధావన్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: February 4, 2019, 8:50 PM IST
శిఖర్ ధావన్..! గ్రౌండ్‌లో వికెట్ల మధ్య ఎంత చురుగ్గా ఉంటాడో..బయట కూడా మనోడు అంతే యాక్టివ్‌గా ఉంటాడు. అందరితోనూ కలిసి పోయి చలాకీగా మాట్లాడతాడు. అప్పుడప్పుడూ డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు. గతంలో ఓసారి శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా వాష్‌రూంలో చేసిన డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే..! ఐతే తాజాగా మరో డ్యాన్స్‌తో క్రికెట్ అభిమానులను ఫిదా చేశాడు గబ్బర్. ఆదివారం న్యూజిలాండ్‌తోొ జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి సంబరాలు చేసుకుంది. భారత ఆటగాళ్లంతా మైదానంలో సందడి చేశారు. ఆ సందర్భంగా శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.


శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్ వీడియోను అభిమానులు కెమెరాల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.


కాగా, న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 4-1 తేడాతో సిరీస్ గెలిచి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్‌లో శిఖర్ ధావన్ 47 సగటుతో 188 పరుగులు చేశాడు. నాలుగు, ఐదో వన్డేల్లో విఫలమయినప్పటికీ భారత్ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గబ్బర్.

First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...