Team India Allout: అండర్సన్ దెబ్బకు టీమ్ ఇండియా ఆలౌట్.. టాప్ స్కోరర్లు వీళ్లే

అండర్సన్ ధాటికి రెండో రోజు కుప్ప కూలిన టీమ్ ఇండియా.. (PC: Twitter)

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగి ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు.

  • Share this:
    సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు (England Tour) వెళ్లిన భారత జట్టు (Team India) రెండో టెస్టు లార్డ్స్  (Lords) వేదికగా ఆడుతున్నది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు రెండో రోజు లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే 364 పరుగులకు ఆలౌట్ (AllOut) అయ్యింది. రెండో రోజు భారత జట్టు ఓవర్ నైట్ స్కోర్ 276/3తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా కేవలం రెండు పరుగుల జోడించిన వెంటనే వికెట్ కోల్పోయింది. శతక వీరుడు కేఎల్ రాహుల్ (129) ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో డామ్ సిబ్లేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (1) మరోసారి నిరాశ పరిచాడు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలసి కాసేపు క్రీజులో ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. దూకుడు మీద ఉన్న పంత్ (37) మార్క్ వుడ్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మహ్మద్ షమీ (0) రెండు బంతులకే పెవీలియన్ చేరాడు. లంచ్ విరామ సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో రవీంద్ర జడేజా క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా అతడికి మరో ఎండ్ నుంచి సహకారం అందలేదు. ఇషాంత్ శర్మ (8), బుమ్రా (0) అవుటైన తర్వాత రవీంద్ర జడేజా (40) కూడా పెవీలియన్ చేరడంలో టీమ్ ఇండియా 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జేమ్స్ అండర్సన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగగా.. ఓలీ రాబిన్‌సన్, మార్క్ వుడ్ చెరి రెండు వికెట్లు, మొయిన్ అలీ ఒక వికెట్ తీశారు.

    ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 5.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ ఏమీ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.





    ఇండియా తొలి ఇన్నింగ్స్

    రోహిత్ శర్మ (బి) అండర్సన్ 83, కేఎల్ రాహుల్ (సి) డామ్ సిబ్లే (బి) ఓలీ రాబిన్‌సన్ 129, చతేశ్వర్ పుజార (సి) జానీ బెయిర్‌స్టో (బి) జేమ్స్ అండర్సన్ 9, విరాట్ కోహ్లీ (సి) జో రూట్ (బి) ఓలీ రాబిన్‌సన్ 42, అజింక్య రహానే (సి) జో రూట్ (బి) జేమ్స్ అండర్సన్ 1, రిషబ్ పంత్ (సి) జాస్ బట్లర్ (బి) మార్క్ వుడ్ 40, రవీంద్ర జడేజా (సి) జేమ్స్ అండర్సన్ (బి) మార్క్ వుడ్ 40, మహ్మద్ షమి (సి) రోరీ బర్న్స్ (బి) మొయిన్ అలీ 0, ఇషాంత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) జేమ్స్ అండర్సన్ 8, జస్ప్రిత్ బుమ్రా (సి) జాస్ బట్లర్ (బి) జేమ్స్ అండర్సన్ 0, మహ్మద్ షమి 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 15, మొత్తం (126.1 ఓవర్లు) 364/10

    వికెట్ల పతనం: 1-126, 2-150, 3-267, 4-278, 5-282, 6-331, 7-336, 8-362, 9-364, 10-364

    బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ (29-7-62-5), ఓలీ రాబిన్‌సన్ (33-10-73-2), సామ్ కర్రన్ (22-2-72-0), మార్క్ వుడ్ (24.1-2-91-2), మొయిన్ అలీ (18-1-53-1)
    Published by:John Naveen Kora
    First published: