హోమ్ /వార్తలు /క్రీడలు /

Tata Motors: టాటా మోటార్స్​ రూటే సపరేటు.. ఒలింపిక్స్​లో పతకం కోల్పోయిన ఆటగాళ్లకు బహుమతి..

Tata Motors: టాటా మోటార్స్​ రూటే సపరేటు.. ఒలింపిక్స్​లో పతకం కోల్పోయిన ఆటగాళ్లకు బహుమతి..

Tata Altroz

Tata Altroz

Tata Motors: దశబ్ధాల నుంచి కలగానే మిగిపోయిన అథ్లెటిక్ స్వర్ణ పతకం చేజిక్కడంతో 2020 టోక్యో ఒలింపిక్స్​ చరిత్ర పుటల్లో నిలిచింది. దీంతో స్వర్ణం గెలుచుకున్న నీరజ్​తో పాటు కాంస్యం, రజతం గెలుచుకున్న ఇతర ఆటగాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున బహుమతులు, నజరానా ప్రకటించాయి.

ఇంకా చదవండి ...

గెలిచిన ఆటగాళ్లకు బహుమతులు అందజేయడం రొటీన్​. కానీ రొటీన్​కు భిన్నంగా ఓడిన వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామంటోంది టాటా సంస్థ. టోక్యో ఒలింపిక్స్​లో భారత ఆటగాళ్లు మునుపెన్నడూ లేనంతగా చెలరేగిపోయారు. ఏకంగా 7 పతకాలు సాధించి పెట్టారు. అందులోనూ దశబ్ధాల నుంచి కలగానే మిగిపోయిన అథ్లెటిక్ స్వర్ణ పతకం చేజిక్కడంతో 2020 టోక్యో ఒలింపిక్స్​ చరిత్ర పుటల్లో నిలిచింది. దీంతో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రా​తో పాటు కాంస్యం, రజతం గెలుచుకున్న ఇతర ఆటగాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున బహుమతులు, నజరానా ప్రకటించాయి. అయితే పతకాలు గెలుచుకున్న వారికే ప్రభుత్వాలు, ప్రముఖ కార్పొరేట్​ సంస్థలు బహుమతులు అందజేస్తుండగా.. టాటా మోటార్స్​ మాత్రం రొటీన్​కు భిన్నంగా కాంస్యం చేజార్చుకున్న ఆటగాళ్లకు బహుమతులు అందజేస్తామని ప్రకటించింది.

‘‘మీరు ఓడినా సరే.. మీ ఆట తీరుతో భారతీయల మనసు గెలుచుకున్నారు’’ అని టాటా మోటార్స్ పేర్కొంది. అందుకే నాలుగో స్థానంలో నిలిచిన భారత గోల్ఫ్​ క్రీడాకారిణి అదితి అశోక్​, రెజ్లర్​ దీపక్​ పునియా, మహిళల హాకీ జట్టు సభ్యులకు హై స్ట్రీట్ గోల్డ్ రంగులోని టాటా అల్ట్రోజ్​ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్లను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ఆయా కార్లను వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో భారతీయ ఒలింపియన్లను సత్కరించిన రెండవ కార్ల తయారీ సంస్థగా టాటా నిలిచింది. ఇప్పటికే మరో వాహన తయారీ సంస్థ మహీంద్రా ఒలింపిక్ విజేతకు బహుమతి ప్రకటించింది. బంగారు పతకం సాధించిన జావెలిన్​ త్రోయర్​ నీరవ్​ చోప్రాకు మహీంద్రా XUV700 SUV ప్రత్యేక ఎడిషన్​ను బహుమతిగా అందజేస్తున్నట్లు తెలిపింది.

మెడల్స్​ కోల్పోయినా.. మనసు గెలుచుకున్నారు..

కాగా, ఈ నిర్ణయంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, ‘‘టోక్యో ఒలింపిక్స్​లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. అయితే, మొదటి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు గెలుచుకున్న వారితో పాటు నాలుగో స్థానంలో ఉన్న వారి క్రీడా స్పూర్తి, పట్టుదల అమోఘం. వారు తృటిలో పతకాన్ని కోల్పోయినప్పటికీ.. తమ అంకిత భావంతో లక్షలాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. వారి క్రీడా స్పూర్తి ఎంతో మంది యువతకు ఆదర్శనీయం. అందుకే ఆయా క్రీడాకారులను సత్కరించాలని నిర్ణయించాం. ప్రముఖ స్వదేశీ ఆటో బ్రాండ్‌గా వారి 'డేర్ టు డ్రీమ్ అండ్ అచీవ్' స్ఫూర్తిని మేము అర్థం చేసుకున్నాము." అని పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Sports, Tata Motors, Tokyo Olympics

ఉత్తమ కథలు