Home /News /sports /

TAP AND RUN PUB FIRE AT UPPER BROUGHTON ITS OWNED BY ENGLAND CRICKETER STUART BROAD AND HIS FORMER TEAMMATE HARRY GURNEY SRD

Cricket : స్టార్ క్రికెటర్‌కి బిగ్ షాక్.. అగ్నిప్రమాదంతో భారీ నష్టం..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Cricket : 2016 లో ఇంగ్లండ్ కు చెందిన మరో ఆటగాడు హ్యారీ గర్నీతో కలిసి బ్రాడ్ ఈ పబ్ ను ప్రారంభించాడు. అప్పర్ బ్రాటన్ అనే గ్రామంలో గల ఈ పబ్ స్థానికంగా పేరుగాంచింది.

    ఇంగ్లండ్ (England) స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్‌ (Stuart Broad)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ (ENG vs NZ) లో బ్రాడ్ ఆడుతున్నాడు. అయితే, ఈ వార్త అతని ఆట గురించి కాదు.. బ్రాడ్ వ్యాపారం గురించి. స్టువర్ట్ బ్రాడ్ కు చెందిన పబ్ లో మంటలు చెలరేగాయి. ఈస్ట్ మిడ్లాండ్స్ లోని అప్పర్ బ్రాటన్ గ్రామంలో ఉన్న ‘ది టాప్ అండ్ రన్’(Tap and Run) పబ్ లో శనివారం తెల్లవారుజామున అగ్రిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై బ్రాడ్ తో పాటు ఈ పబ్ సహా యజమానిగా ఉన్న హ్యారీ గర్నీ లు విచారం వ్యక్తం చేశారు. 2016 లో ఇంగ్లండ్ కు చెందిన మరో ఆటగాడు హ్యారీ గర్నీతో కలిసి బ్రాడ్ ఈ పబ్ ను ప్రారంభించాడు.

    అప్పర్ బ్రాటన్ అనే గ్రామంలో గల ఈ పబ్ స్థానికంగా పేరుగాంచింది. అయితే శనివారం తెల్లవారుజామున (3.22 గంటలకు) ఈ పబ్ లో అగ్ని ప్రమాదం జరిగి.. ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. వీటిని అదుపు చేసేందుకు దాదాపు 8 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. రెండుగంటల పాటు కష్టపడితే మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో అపార నష్టం వాటిల్లింది. అయితే.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిపై బ్రాడ్ గ్రామస్తులకు, పబ్ కస్టమర్లకు క్షమాపణలు చెప్పాడు.



    ‘‘శనివారం ఉదయం మా పబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ వార్త నిజమని నేను నమ్మలేకపోతున్నాను. ఎవరూ గాయపడలేదు, ఇది మంచి విషయం. నాటింగ్‌హామ్‌షైర్ ఫైర్ సర్వీసెస్ మరియు మా చుట్టుపక్కల ప్రజలు మాకు చాలా సహాయం చేసారు. వారికి రుణపడి ఉంటాను' అని బ్రాడ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో, అతను పబ్ ఫోటోను (స్టువర్ట్ బ్రాడ్ పబ్ ఫైర్ ఫోటో) కూడా షేర్ చేశాడు.




    మరో ట్వీట్‌లో స్టువర్ట్ సిబ్బంది అందరినీ ప్రశంసించాడు.' కస్టమర్‌ల కోసం గొప్ప పబ్‌ను నిర్మించడంలో సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారు. నా ఆలోచనలన్నీ మా స్టాఫ్ గురించే ఉన్నాయి. ఇలా జరిగినందుకు బాధగా ఉంది. కానీ మేం త్వరలోనే తేరుకుంటాం..' అని ట్వీట్ చేశాడు.స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్ ఆడటమే కాకుండా అనేక ఇతర వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడు. ఈ వ్యాపారాలలో పబ్ ఒకటి. కానీ ఇప్పుడు అగ్ని ప్రమాదంతో బ్రాడ్ కు భారీ నష్టం కలిగింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, England vs newzealand, Fire Accident

    తదుపరి వార్తలు