Home /News /sports /

TAMIL NADU YOUNG KABADDI PLAYER VIMAL RAJ DIED DURING THE GAME VIDEO GOES VIRAL SJN

Kabaddi Player Died : అచ్చం భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలాగే.. కబడ్డీ కోర్టులోనే మరణించిన ప్లేయర్ (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

Kabaddi Player Died : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో నిర్వహించిన కబడ్డీ (Kabaddi) పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోని పన్రుతి టౌన్ పరిధిలోని మనడికుప్పం గ్రామంలో నిర్వహించిన కబడ్డీ గేమ్స్ ఓ ఆటగాడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

ఇంకా చదవండి ...
Kabaddi Player Died : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో నిర్వహించిన కబడ్డీ (Kabaddi) పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోని పన్రుతి టౌన్ పరిధిలోని మనడికుప్పం గ్రామంలో నిర్వహించిన కబడ్డీ గేమ్స్ ఓ ఆటగాడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గేమ్స్ లో పాల్గొన్న విమల్‌రాజ్ (Vimal Raj) అనే యువకుడు లైవ్‌ మ్యాచ్‌లోనే ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళితే.. రెండు జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరగ్గా.. మ్యాచ్ మధ్యలో 22 ఏళ్ల విమల్ రాజ్ కూతకి వెళ్లాడు. ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి తప్పించుకుని గీతను దాటే ప్రయత్నం చేయగా.. అతడిని అడ్డుకునే ప్రయత్నంలో ఓ ప్లేయర్ విమల్ రాజ్ ఛాతీపై మోకాలితో ఢీ కొట్టాడు. అయితే విమల్ రాజ్ గీత ధాటడంతో ప్రత్యర్థి ప్లేయర్ అవుటయ్యాడు.

విమల్‌రాజ్‌కే పాయింట్ ఇస్తూ రిఫరీ విజిల్ కూడా వేశాడు. ప్రత్యర్థి ప్లేయర్ తనపై నుంచి లేవగానే పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్‌రాజ్, లేస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, రిఫరీ వచ్చి లేపేందుకు ప్రయత్నించిగా విమల్ రాజ్ లేవలేదు. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు మార్గంలోనే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. . దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



చూస్తుండగానే ఓ నిండు ప్రాణం బలవ్వడాన్ని ఆ ఊరి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ల ముందే ఆడిన ప్లేయర్ నిమిషాల వ్యవధిలో ఉలుకూ పలుకూ లేకుండా పడిపోవడాన్ని చూసి వారు కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. వెంటనే టోర్నీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. విమల్ రాజ్ కు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అందజేశారు.

కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయి ఉండాడని ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. కాగా 2010లో తెలుగు హీరో నాని నటించిన 'భీమిలీ కబడ్డీ జట్టు' సినిమా తరహాలోనే ఇక్కడ విమల్‌రాజ్‌ ప్రాణాలు వదలడం అందరిని కలిచివేస్తోంది.

కేసు నమోదు

విమల్ రాజ్ మరణాన్ని పోలీసులు కేసుగా నమోదు చేశారు. గేమ్ లో అనుకోకుండా ఈ సంఘటన జరిగిందా.. లేదా ప్లాన్ ప్రకారం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Death, Died, India Vs Westindies, Kabaddi, Players, Tamil nadu

తదుపరి వార్తలు