బాల్ లేదు కాని బౌలింగ్ ఉంది... గల్లీ క్రికెట్ వీడియోను రిట్వీట్ చేసిన కేటీఆర్

news18-telugu
Updated: April 15, 2019, 3:49 PM IST
బాల్ లేదు కాని బౌలింగ్ ఉంది... గల్లీ క్రికెట్ వీడియోను రిట్వీట్ చేసిన కేటీఆర్
  • Share this:
పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స...వేలల్లో ఆడియన్స్... ఈలలు గోలలు ఇవన్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో మనకు కనిపించే సందడి. ఇలాంటి మ్యాచులకు అందరూ వెళ్లలేరు. చాలామంది టీవీల్లోనే చూసి ఎంజాయ్ చేస్తుంటారు. భారతీయుల్లో అయితే చాలామంది క్రికెట్‌ను పిచ్చిపిచ్చిగా అభిమానిస్తున్నారు. కుర్రాళ్లైతే... వీలు దొరికినా.. వేసవి సెలవులు వచ్చిన గ్రౌండ్‌కు పరుగులు తీస్తూ క్రికెట్ ఆడుతుంటారు. ఇక ఊరువాడల్లో కూడా ఈ మ్యాచులు జరుగుతుంటాయి. చిన్నపిల్లలు సైతం క్రికెట్ బ్యాటు బాల్ పట్టుకొని క్రికెట్ ఆడేస్తుంటారు. అక్కడున్న చాలామంది వీరి ఆటను ఆసక్తిగా చూస్తుంటారు.ఒక్కోసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కంటే గల్లీ క్రికెట్టే చూడ్డానికి భలే ముచ్చటేస్తుంది. కుర్రకారు సీరియస్‌గా ఆడే ఈ సిల్లీ గేమ్ నుంచి కళ్ళు తిప్పుకోవాలనిపించదు. ఇప్పడు అలాంటి ఓ గల్లీ క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్రికెట్‌లో బాల్ ఉండదు. కానీ.. బౌలింగ్ ఉంటుంది. భలే మజానిస్తుంది. ఓ బుడ్డోడు పరుగెత్తుకొని వచ్చి బ్యాట్‌పై దూకగానే... పక్కనే ఉన్న మరో కుర్రాడు ఆ పిల్లాడ్ని క్యాచ్ పట్టుకుంటాడు. తాజాగా సీనియర్ ఫిలిం టెక్నీషియన్ సెంథిల్ కుమార్ పోస్ట్ చేసిన ఈ క్రికెట్ ఫ్లిక్ అటుతిరిగి ఇటుతిరిగి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు వచ్చేసింది. అలా చూశాడో లేదో ఇలా అందిపుచ్చుకుని రీట్వీట్ చేశాడు కేటీఆర్. ఈ మధ్యకాలంలో ఇంతటి టాలెంటెడ్ బౌలర్‌ని ఎక్కడా చూడలేదు అంటూ ఓ కుర్రకుంకకు సర్టిఫికెట్ ఇచ్చేశాడు.


First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading