TAKE A LOOK AT SIX WAYS IN WHICH GOOGLE IS BRINGING ALL THE DETAILS AND THE FUN FROM THE TOKYO OLYMPICS 2020 GH SRD
Tokyo Olympics 2020: ఒలింపిక్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందివ్వనున్న గూగుల్.. ఫీచర్లను ఇలా యాక్సెస్ చేయండి..
గూగుల్ డూడుల్ (Image Source : Google)
Tokyo Olympics 2020: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తాజాగా ఒక బ్లాగ్ షేర్ చేసింది. ఈ బ్లాగులో.. హాయిగా ఇంట్లో కూర్చొనే ఒలింపిక్స్‌ను ఎంజాయ్ చేయడంటూ పేర్కొంది. అయితే ఆ బ్లాగు ప్రకారం, గూగుల్ తమ యూజర్ల కోసం తెచ్చిన 6 అద్భుతమైన ఫీచర్స్ ఏంటో చూద్దాం.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తాజాగా ఒక బ్లాగ్ షేర్ చేసింది. ఈ బ్లాగులో.. హాయిగా ఇంట్లో కూర్చొనే ఒలింపిక్స్‌ను ఎంజాయ్ చేయడంటూ పేర్కొంది. అయితే ఆ బ్లాగు ప్రకారం, గూగుల్ తమ యూజర్ల కోసం తెచ్చిన 6 అద్భుతమైన ఫీచర్స్ ఏంటో చూద్దాం.
గూగుల్ అన్ని దేశాల ర్యాంకులతో పాటు సమీప భవిష్యత్తులో జరగబోయే అన్ని ఈవెంట్స్ కు సంబంధించిన సమాచారం క్షణాల్లోనే అందిస్తుంది. ఉదాహరణకు 'ఇండియా ఒలింపిక్స్' అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు.. భారతీయ ఆటగాళ్లు ఆడబోయే మ్యాచ్ లకు సంబంధించిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. అలాగే మీరు సెర్చ్ చేసిన దేశానికి సంబంధించిన వార్తలు, రిజల్ట్స్, వీడియోలు వీక్షించేందుకు వీలుగా ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఒకవేళ మీరు గేమ్స్ చూడటం మిస్సయితే.. గూగుల్ ఆఫర్ చేసే వీడియోల ద్వారా వీక్షించవచ్చు. ఫలానా మ్యాచ్ రిజల్ట్స్ తెలుసుకోవాలంటే.. రిజల్ట్స్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
2) గూగుల్ డూడుల్:
అందరికీ ఎంతో ఇష్టమైన గూగుల్ డూడుల్ ప్రస్తుతం సరికొత్త గేమ్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా గూగుల్ జపనీస్ యానిమేషన్ స్టూడియో 4°C సహకారంతో ‘ఛాంపియన్ ఐలాండ్ గేమ్స్’ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లు టోర్నమెంట్ గేమ్స్ ఆడొచ్చు. స్కేట్ బోర్డింగ్, రగ్బీ, క్లైంబింగ్ వంటి అడ్వెంచర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ గేమ్స్ లో ఛాంపియన్లుగా రాణించే ప్లేయర్లను ఓడించటానికి కూడా ప్రయత్నించవచ్చు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ మంచి అనుభూతి పొందవచ్చు. ఈ గేమ్స్ ఆడటం కోసం మీరు "గూగుల్.కో.ఇన్" సైట్ లోకి వెళ్లి డూడుల్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
3) యూట్యూబ్, గూగుల్ టీవీలలో ఒలింపిక్స్ లైవ్ అప్డేట్స్:
ఈ ఫీచర్ తో మార్కా క్లారో, యూరోస్పోర్ట్ ఛానెల్‌ల నుంచి లైవ్ ఈవెంట్లతో పాటు క్లిప్‌లు, ముఖ్యాంశాలను వీక్షించవచ్చు. "ఒలంపిక్స్" అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. గూగుల్ టీవీ వినియోగదారులు "ఫర్ యూ" అనే పేజీని విజిట్ చేస్తే సరిపోతుంది.
4) ఎవరు గెలిచారో చెప్పే గూగుల్ అసిస్టెంట్:
ఒలంపిక్స్ పోటీలలో ఎవరు గెలిచారు? అనే ప్రశ్నలకు గూగుల్ అసిస్టెంట్ సమాధానం ఇవ్వగలదు. "హే గూగుల్, ఒలింపిక్స్‌లో మహిళల బాస్కెట్‌బాల్ లో ఎవరు గెలిచారు?" అని ప్రశ్నించగానే సమాధానం ఇస్తుంది. “హే గూగుల్, ఒలింపిక్స్‌లో ఇండియా ఎన్ని పతకాలు గెలుచుకుంది?” అని ప్రశ్నించినా ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.
5) ఒలింపిక్స్‌కి సంబంధించిన అప్లికేషన్లు:
గూగుల్ ప్లే స్టోర్ లో అధికారిక ఒలంపిక్స్ యాప్ తో పాటు అనేక అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
6) జపాన్ను ఎక్సప్లోర్ చేసే గూగుల్ ఆర్ట్స్&కల్చర్, స్ట్రీట్ వ్యూ, ట్రాన్స్‌లేట్:
యూజర్లు గూగుల్ ఆర్ట్స్& కల్చర్ అప్లికేషన్ ద్వారా జపాన్ సాంప్రదాయ హస్తకళలు, జపాన్ ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారా జపాన్ లోని వీధులను వీక్షించవచ్చు. టోక్యోలోని వీధులు, మంచుతో కప్పబడిన పర్వతాలు చూడవచ్చు. మీకు జపనీస్ నేర్చుకోవాలన్న కోరిక ఉంటే.. గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయం చేస్తుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.