సింధుకు ఆ అవకాశం ఉంది - సైనా నెహ్వాల్

హైట్ సింధుకు పెద్ద అడ్వాంటేజ్... ఫైనల్లో ఇద్దరికీ సమాన అవకాశాలు... ఓపిగ్గా ఆడితే సింధు స్వర్ణం గెలవడం కష్టమేమీ కాదు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 28, 2018, 11:41 AM IST
సింధుకు ఆ అవకాశం ఉంది - సైనా నెహ్వాల్
పీవీ సింధుతో సైనా నెహ్వాల్ (పాత చిత్రం)
  • Share this:
ఏషియాడ్ 2018లో ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ చేరి, చరిత్ర సృష్టించింది తెలుగు తేజం పీవీ సింధు. వరల్డ్ నెం. 1 టైజూతో ఆమె ఫైనల్ ఆడబోతోంది. అయితే ఫైనల్‌లో పీవీ సింధు గెలిచే అవకాశం మాత్రం 50-50 అంటుందో ఆమె సహచరి, ఏషియాడ్‌లో కాంస్యం గెలిచిన సైనా నెహ్మాల్. సెమీ ఫైనల్‌లో టై జూను ఎదుర్కొన్న సైనా నెహ్మాల్, రెండు సెట్లలో ఓడిపోయి, కాంస్యంతో సరిపెట్టుకుంది. టై జూ ఆటను అంత తేలిగ్గా అర్థం చేసుకోలేమని చెప్పిన సైనా నెహ్మాల్, స్వర్ణం గెలవాలంటే పీవీ సింధు చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పింది.

1982 న్యూఢిల్లీలో జరిగిన ఆషియాడ్‌లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్యం పతకం గెలిచాడు. ఇప్పటిదాకా భారత్ తరుపున ఏషియాడ్‌లో అదే అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా 2018 ఏషియాడ్‌లో కాంస్యం గెలిచిన సైనా నెహ్మాల్, చరిత్ర సృష్టించింది. ఏషియాడ్‌లో కాంస్యపతకం గెలిచిన తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు క్రియేట్ చేసింది. పీవీ సింధు ఏకంగా ఫైనల్ చేరింది. దాంతో భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరడం ఖాయమైపోయింది. కానీ పీవీ సింధు స్వర్ణం గెలవాలనే అందరూ కోరుకుంటున్నారు.

టై జు యింగ్ ఆటను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆమె వేగం, కదలికల్లో చురుకుదనం అందుకోవాలంటే చాలా మంచి షాట్లు ఆడాల్సి ఉంటుంది. ఆమె ఎన్నో విభిన్నమైన షాట్లతో విరుచుకుపడుతుంది. ఆమె ఆట కోచ్‌లకు కూడా ఓ పట్టాన అర్థం కాదు. సాధారణంగా ఒక్కో ప్లేయర్‌కు ఒక్కో రకమైన స్టైల్ ఉంటుంది. కానీ టై జూ అందుకు మినహాయింపు. ఆమె ఎప్పుడూ కొత్తగా, సృజనాత్మక షాట్లతో ఆడుతుంది. ఎంతగా కట్టడి చేయాలని ప్రయత్నించినా, మనల్నే ఇబ్బందుల్లో పడేస్తుంది. అయితే పీవీ సింధు, టైజూను ఓడించడం అసాధ్యమేమీ కాదు. చాలా ఓపిగ్గా ఆడితే గెలవడం సాధ్యమే. సింధు నాకంటే పొడగరి. అది ఆమెకు మంచి అవకాశం కూడా. టైజూ, పీవీ సింధుల్లో ఇద్దరికీ 50-50 అవకాశాలున్నాయి.
సైనా నెహ్మాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి


అయితే సైనా నెహ్మాల్ కామెంట్లపై పీవీ సింధు సానుకూలంగా స్పందించింది. వరల్డ్ నెం. 1 టైజూను ఎదుర్కోనేందుకు తన వ్యూహాలు తనకున్నాయని చెప్పింది.

టై జూ చాలా మంచి ప్లేయర్, అయితే ఆమెను ఎదుర్కొనేందుకు నా వ్యూహ్యాలు నాకున్నాయి. ఫైనల్లో ఒత్తిడికి లోను కాకుండా బరిలోకి దిగాలనుకుంటున్నా. సెమీస్‌లో సైనా ఓడినా, అద్భుతంగా ఆడింది. వెనుకంజలో నిలిచినా ఏ మాత్రం పట్టు వీడలేదు. తన ఆట నుంచి ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నా.
పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
కోచ్ పుల్లెల గోపిచంద్ షెటర్ల ఆటతీరు, ప్రదర్శన పట్ల ప్రశంసలు కురిపించారు. సెమీ ఫైనల్లో సైనా ఆటతీరు గర్వించే విధంగా ఉందని చెప్పిన ఆయన, సింధు అద్భుతంగా ఆడి ఫైనల్ చేరిందన్నారు. సింధు స్వర్ణం నెగ్గుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు గోపిచంద్.
First published: August 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading