టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో భారత టీటీ ప్లేయర్ (Table tennis star) మానికా బత్రా (Manika Batra)... మూడో రౌండ్లో ఓడిన విషయం తెలిసిందే. టీటీలో పోటీపడిన మిగిలిన ప్లేయర్లు టైమ్ అవుట్లో కోచ్‌ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటుంటే... మానికా బత్రా మాత్రం ఒంటరిగా పోరాడింది. ఇండియన్ ఒలింపిక్ కమిటీ నియమించిన నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ ను కాదని.. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంది. దీనిపై ఐవోసి మనికా బాత్రాపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే, లేటెస్ట్ గా మనికా బాత్రా సౌమ్యదీప్ రాయ్ పై సంచలన ఆరోపణలు చేసింది. సౌమ్యదీప్ రాయ్ ని తనని ఫిక్సింగ్ చేయమన్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్. సుతీర్ధ, మనికాలు సౌమ్యదీప్ రాయ్ పర్యవేక్షణలోనే జాతీయ టీటీ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒలింపిక్ క్వాలిఫయర్స్ అప్పుడూ తనను ఓ మ్యాచ్ ఓడిపోమ్మానడంటూ మనికా బాత్రా సౌమ్యదీప్ రాయ్ పై విమర్శలు గుప్పించింది. అందుకే ఒలింపిక్స్ లో సౌమ్యదీప్ రాయ్ ని కోచ్ గా వద్దన్నంటూ ఆమె తెలిపింది.
ఇక, క్రీడాకారులు వ్యక్తిగత కోచ్‌లను పెట్టుకుంటే తప్పేంటనని భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్రా ప్రశ్నించింది. వ్యక్తిగత కోచ్‌లు ఉంటే ఇగో (అహం) కాదని, అది కనీస అవసరమని వ్యాఖ్యానించింది.
మనికా మాట్లాడుతూ.. ‘టీమ్ ఈవెంట్లు ఉన్నప్పుడు చీఫ్ కోచ్ ఉండటం సబబే. కానీ టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ లలో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు వ్యక్తిగత కోచ్‌ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కోచ్ అయితే తాను శిక్షణనిచ్చే ప్లేయర్ ఆటతీరుతో పాటు అతడు/ఆమె గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. కానీ చీఫ్ కోచ్ మొత్తం టీమ్ సభ్యుల పోటీల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కోచ్‌లను పెట్టుకోవడం ఇగో కాదు. అది కనీస అవసరం’ అని తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన పలు మ్యాచ్‌లలో ఆమె టీటీ చీఫ్ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌ను తిరస్కరించడంపై వివాదం నెలకొని షోకాజ్ నోటీసులను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనికా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. షోకాజ్ నోటీసులకు మనికా స్పందిస్తూ.. రాయ్ మీద అభ్యంతరాలు లేవనెత్తింది. తనకు సరైన న్యాయం చేయాలని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)కు లేఖ రాసింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.