హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit Sharma : మీకు దండం రా అయ్యా..! టీమిండియా బౌలర్లను ప్రాధేయపడ్డ రోహిత్..

Rohit Sharma : మీకు దండం రా అయ్యా..! టీమిండియా బౌలర్లను ప్రాధేయపడ్డ రోహిత్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Rohit Sharma : టీమిండియా బౌలింగ్ రోహిత్ శర్మ, ద్రవిడ్ లకు ఓ పీడకలగా మారింది. ఫ్యాన్స్ ను కూడా టీమిండియా బౌలింగ్ భయపెడుతుంది. ఇదే బౌలింగ్ తో టీ20 వరల్డ్ కప్ కొట్టడం కష్టమంటున్నారు క్రీడా పండితులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా మహాసమరానికి తెరలేవనుంది. ఇక, సొంత గడ్డ వేదికగా సౌతాఫ్రికా (India vs South Africa) తో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. అయితే, ఇండోర్ లో జరిగిన సిరీస్ లోని ఆఖరి టీ20 మ్యాచులో సఫారీ జట్టు చేతిలో టీమిండియా (Team India) భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్ కన్నా ముందు ఆస్ట్రేలియా జట్టును కూడా 2-1 తేడాతో ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. అయితే, సిరీస్ ల మీద సిరీస్ లు గెలిచినా.. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీలో చేతులేత్తేసింది. ఇక, త్వరలో ప్రారంభం కానున్న మెగాటోర్నీలో టీమిండియా రాణించాలంటే చాలా సమస్యల్ని అధిగమించాల్సి ఉంది.

    ఇక, టీమిండియా బౌలింగ్ రోహిత్ శర్మ, ద్రవిడ్ లకు ఓ పీడకలగా మారింది. ఫ్యాన్స్ ను కూడా టీమిండియా బౌలింగ్ భయపెడుతుంది. ఇదే బౌలింగ్ తో టీ20 వరల్డ్ కప్ కొట్టడం కష్టమంటున్నారు క్రీడా పండితులు. ఇక, సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచులో టీమిండియా బౌలర్లపై కెప్టెన్ రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.రెండు చేతులు జోడించి మరీ దండం పెడుతూ.. మంచి బౌలింగ్‌ వేయాలంటూ ప్రాధేయపడ్డాడు.

    ఇప్పుడు రోహిత్ చేసిన పని వైరల్ గా మారింది. మూడో టీ20 మ్యాచులో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. టీమిండియా బౌలర్లు ధారళంగా పరుగులు ఇస్తుండడం, ఫీల్డ్‌ సెట్‌ తగ్గట్లు కాకుండా వేరే విధంగా బౌలింగ్‌ చేస్తుండటంపై అసహనానికి గురైన రోహిత్‌.. రెండు చేతులు జోడించి మరీ మంచి బౌలింగ్‌ వేయమని బౌలర్లను కోరాడు. రోహిత్‌ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్‌ దండం పెడుతున్న ఫొటో వైరల్‌ అవుతోంది.

    స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరమవ్వడం ఇండియాకు సమస్యగా చెప్పవచ్చు. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌.. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ లతో కలిసి రాబోయే వరల్డ్ కప్ లో పేస్‌ దళాన్ని నడిపించనున్నాడు. భువనేశ్వర్‌ పవర్ ప్లేలో మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేస్తున్నా.. ఆఖరి ఓవర్లలో తేలిపోతున్నాడు. అర్షదీప్, దీపక్ చాహర్ లు కూడా ఇందుకు పెద్ద మినహాయింపేమీ కాదు.

    వీళ్లు కూడా యథా రాజా తథా ప్రజా అన్నట్టు డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక, హర్షల్ పటేల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అటు వికెట్లు తీయడం పక్కన పెడితే.. ఫస్ట్ ఓవర్ నుంచే భారీగా పరుగులు సమర్పిస్తూ జట్టుకు భారంగా మారాడు. చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తుండటం, పవర్‌ప్లేలో ఎక్కువగా వికెట్లు పడగొట్టలేకపోవడం టీం ఇండియాకు నష్టం కలిగించే అంశాలు. రానున్న మ్యాచుల్లో ఈ సమస్యలను అధిగమించకపోతే కప్ కొట్టడం పక్కన పెడితే.. మంచి ప్రదర్శన కూడా టీమిండియా నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది.

    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs South Africa, Rohit sharma, T20 World Cup 2022, Team India

    ఉత్తమ కథలు