T20 WORLD CUPS PAKISTAN ASKS VISA ASSURANCE FROM INDIA SA
అలా జరగకపోతే.. టీ20 వరల్డ్ కప్ వేదికను తరలించండి!
India-Pakistan
మా దేశ పౌరుల భధ్రత మాకు చాలా ముఖ్యం. క్రికెటర్లతో పాటు మ్యాచ్ వీక్షిణ కోసం వచ్చే అభిమానులు, అధికారులు, విలేకరులకూ విసాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయం భారత్ మార్చి చివరికల్లా హామీ ఇవ్వాలని ఐసీసీకి వివరించాం
Last Updated:
Share this:
త్వరలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ హాజరయే విషయంలో పాకిస్థా్న్ పేచిలు పెడుతుంది. తమకు భారత్ రాతపూర్వక హామి ఇవ్వాలని.. లేకుంటే టీ20 ప్రపంచకప్ వేదికను యూఏఈకి మార్చాలనంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సన్ మణి తెలిపారు. తాజాగా టీ 20 వరల్డ్ కప్ వేదికపై స్పందించిన ఆ దేశ క్రికెట్ బోర్డు.. కొన్ని అనుమానులు వ్యక్తం చేసింది. జట్టుతో పాటు మ్యాచ్‌లకు హాజరయే అభిమానులు, విలేకరులకు కూడా వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని కొరింది. తమ అనుమానాలు అన్ని ఐసీసీకి తెలియజేశామని వివరించారు.
మా దేశ పౌరుల భధ్రత మాకు చాలా ముఖ్యం. క్రికెటర్లతో పాటు మ్యాచ్ వీక్షిణ కోసం వచ్చే అభిమానులు, అధికారులు, విలేకరులకూ విసాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయం భారత్ మార్చి చివరికల్లా హామీ ఇవ్వాలని ఐసీసీకి వివరించాం. ఎలాంటి హామీ ఇవ్వకపోతే ఐసీసీ.. టీ20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి మార్చాలని తెలిపాం’ అని మణి వెల్లడించారు.
ఇక అక్టోబర్-నవంబర్ నెలలో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్థాన్ హాజరు అవడంపై పేచిలు పెడుతుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా గత కొంత కాలంగా ఇరు జట్లు స్వదేశాల్లో టోర్నీలు ఆడడం లేదు.